Telugu Global
Telangana

పో..పో.. వెళ్లిపో.. ప్రచారంలో 'బూర'కు చేదు అనుభవం

గ్యాస్ సిలిండర్‌తో స్థానికులు ప్రదర్శనగా వచ్చారు. గ్యాస్ రేట్లు పెంచి ప్రజలపై భారాన్ని మోపిన బీజేపీని తాము క్షమించబోమంటూ రివర్స్ అయ్యారు స్థానికులు. దీంతో మాజీ ఎంపీ షాకయ్యారు. పలాయనం చిత్తగించారు.

పో..పో.. వెళ్లిపో.. ప్రచారంలో బూరకు చేదు అనుభవం
X

ఆమధ్య ప్రచార పర్వంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ప్రజలు తరిమికొట్టారు. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి సతీమణికి కూడా ప్రచారంలో ఇలాంటి చేదు అనుభవమే దక్కింది. తాజాగా బూర నర్సయ్య గౌడ్‌ని జై కేసారం గ్రామ ప్రజలు వెనక్కి తరిమేశారు. కారు రివర్స్ గేర్ వేసుకుని వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం కారులో నుంచి దిగేందుకు కూడా 'బూర'కు అవకాశమివ్వలేదు స్థానికులు.

నీరుగారిపోయిన ఉత్సాహం..

మునుగోడు టీఆర్ఎస్ టికెట్ ఆశించిన బూర నర్సయ్యగౌడ్.. ఇటీవల బీజేపీలో చేరారు. పార్టీలో చేరానన్న ఉత్సాహమో, లేక 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ సొమ్ముల్లో రాజగోపాల్ రెడ్డి ఏమైనా విదిల్చారో తెలియదు కానీ.. ఆయన ప్రచారానికి పరుగులు పెట్టారు. జై కేసారంలో తనకు అనువైన చోట ప్రజల్ని కలసి ఓట్లు అభ్యర్థించాలనుకున్నారు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది. నర్సయ్యగౌడ్ వస్తున్న కారుని స్థానికులు అడ్డుకున్నారు. గ్యాస్ సిలిండర్‌తో ప్రదర్శనగా వచ్చారు. గ్యాస్ రేట్లు పెంచి ప్రజలపై భారాన్ని మోపిన బీజేపీని తాము క్షమించబోమంటూ రివర్స్ అయ్యారు స్థానికులు. దీంతో మాజీ ఎంపీ షాకయ్యారు. పలాయనం చిత్తగించారు.

ఓటమి సంకేతాలు కనిపిస్తున్నాయా..

బీజేపీకి ఓటమి సంకేతాలు కనిపిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. కేంద్ర నాయకత్వం కూడా ప్రచారాన్ని పక్కనపెట్టింది. బండి సంజయ్, కిషన్ రెడ్డి మరీ అంతగా పూసుకోవట్లేదు. రాజగోపాల్ రెడ్డి ఒక్కరే కిందామీదా పడుతున్నారు. రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్ ప్రతిఫలం రాజగోపాల్ రెడ్డిని పాపంలా వెంటాడుతోంది. దీనికితోడు ఇటీవల పార్టీ నుంచి రాజీనామాల పరంపర బాగా పెరిగింది. ఇవన్నీ బేరీజు వేసుకుంటే బీజేపీ ముందుగానే ఓటమికి మానసికంగా సిద్ధమైపోయినట్టు తెలుస్తోంది. తాజాగా స్థానికులు, ప్రచారానికి వచ్చిన నాయకుల్ని తరుముకుంటున్నారంటే బీజేపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Next Story