Telugu Global
Telangana

లండన్‌లో బోనాలు.. పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

టాక్ సంస్థ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు అన్ని సందర్భాల్లో వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ కవితకు టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల కృతజ్ఞతలు తెలిపారు.

లండన్‌లో బోనాలు.. పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
X

యూకే రాజధాని లండన్‌లో బోనాల జాతర ఈ నెల 25న నిర్వహించనున్నారు. లండన్ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టీఏయూకే - టాక్) ఆధ్వర్యంలో వెస్ట్ లండన్‌లోని సయన్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు లండన్ బోనాల జాత పోస్టర్‌ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర పండుగను ఖండాంతరాల్లో కూడా ఘనంగా నిర్వహించడమే కాకుండా, మన సంస్కృతిని దశదిశలా చాటా చెప్పడానికి టాక్ చేస్తున్న కృషిని కవిత అభినందించారు.

టాక్ సంస్థ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు అన్ని సందర్భాల్లో వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ కవితకు టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల కృతజ్ఞతలు తెలిపారు. కవిత ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్ని రకాలుగా కృషి చేస్తామని ఆయన అన్నారు.

బోనాల జాతర విషయంలోనే కాకుండా.. ఇతర అన్ని విషయాల్లో కూడా ఎప్పటికప్పుడు వారి సలహాలు, సూచనలతో ముందుకు వెళ్తామని చెప్పారు. యూకేలో నివశిస్తున్న ప్రవాసులంతా బోనాల వేడుకలకు కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలంతో పాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.



First Published:  3 Jun 2023 8:06 AM GMT
Next Story