Telugu Global
Telangana

టీఆర్ఎస్‌పై అవినీతి మ‌కిలి!.. తెలంగాణ‌లో బీజేపీ వ్యూహం ఇదేనా?

ఆ క్ర‌మంలోనే కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై తొలి నుంచీ అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. దీనిపై కేసీఆర్ గ‌ట్టిగానే బ‌దులిస్తున్నారు. వారి ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొడుతున్నారు.

టీఆర్ఎస్‌పై అవినీతి మ‌కిలి!.. తెలంగాణ‌లో బీజేపీ వ్యూహం ఇదేనా?
X

దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విస్త‌రించాల‌నే ప్ర‌ణాళిక‌తో దూకుడుగా సాగుతున్న న‌రేంద్ర మోదీ, అమిత్ షాల దృష్టి కొన్నాళ్లుగా ద‌క్షిణాదిలో తెలంగాణ‌పై బ‌లంగా ఉండ‌టం తెలిసిందే. ఇక్కడ పాగా వేసి.. అధికార పగ్గాలు చేపట్టడం కోసం ర‌క‌ర‌కాల పావులు క‌దుపుతున్నారు. అయితే తెలంగాణ ప్రజల నరనరాల్లోనూ జీర్ణించుకుపోయిన.. కేసీఆర్ వాదాన్ని.. తెలంగాణ సెంటిమెంటును తమవైపు.. తిప్పుకోవడం వారు అనుకున్నంత తేలికేమీ కాదు.

రాష్ట్రంలో టీఆర్ఎస్‌కి ఉన్న కేడ‌ర్ చాలా బ‌ల‌మైన‌ది. టీఆర్ఎస్ కి ఉన్న యంత్రాంగం క్యాడర్ నాయకులు.. రాజకీయ వ్యూహాలు.. ఉద్యమ నేపథ్యం వంటివి.. బీజేపీకి లేవనే అభిప్రాయం ఉంది. ఆ విష‌యం అర్థ‌మైందో ఏమో ఇప్పుడు ఎలాగైనా తెలంగాణ‌లో అధికారం చేప‌ట్ట‌డం కోసం.. ఏదోక సంచ‌ల‌నం సృష్టించ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ నేత‌లు వ్యూహాలు ప‌న్నుతున్న‌ట్టు తెలుస్తోంది. సాధారణంగా.. బీజేపీ ప్రయోగించే అస్త్రాల్లో కీలకమైనవి.. అవినీతి ఆరోపణలు.. సీబీఐ.. ఈడీ.. వంటివే ఎక్కువ‌.

ఆ క్ర‌మంలోనే కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై తొలి నుంచీ అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. దీనిపై కేసీఆర్ గ‌ట్టిగానే బ‌దులిస్తున్నారు. వారి ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొడుతున్నారు.

దీనికితోడు తాజాగా ఢిల్లీ పెద్దలు.. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో కేసీఆర్ కుమార్తె క‌విత పేరును బయటకు లాగిన విష‌యం తెలిసిందే. ఇందులో నిజ‌మెంత‌నేది తెలియాల్సి ఉంది. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై ఆమె ఇప్పటికే పరువునష్టం దావా వేయడంతో.. బీజేపీ నేతల నోటికి తాళం పడింది.

అయినా.. బీజేపీ ఏదో ఒకరకంగా.. కేసీఆర్‌పై.. ఆయన కుటుంబ పాలనపై.. అవినీతి మరకలు అంటించి దానిని ప్ర‌జ‌ల్లో విస్తృతంగా ప్ర‌చారం చేసి ల‌బ్ధి పొందే ప్ర‌ణాళిక‌లు వేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ త‌ర‌హా వ్యూహాల‌ను ఇప్ప‌టికే బీజేపీ చాలా రాష్ట్రాల్లో అమ‌లు చేసి స‌క్సెస్ అయ్యింది కూడా. ఇదే వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేయడం ద్వారా.. ప్రజల్లోనే కేసీఆర్ పట్ల వ్యతిరేకత వస్తే.. దానిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అంటున్నారు. మ‌రి అందుకు అవ‌కాశ‌ముందా? అంటే కాల‌మే స‌మాధానమే చెప్పాలి.

First Published:  29 Aug 2022 7:03 AM GMT
Next Story