Telugu Global
Telangana

25 వేల మంది ఫాలోవర్లు ఉంటేనే ఎమ్మెల్యే టికెట్‌.. బీజేపీ కండీషన్‌

దాదాపు 6 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. దీంతో అభ్యర్థులను ఫైనల్ చేయడం ఆ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. దీంతో అభ్యర్థులకు కొన్ని కండీషన్లు పెట్టినట్లు తెలుస్తోంది.

25 వేల మంది ఫాలోవర్లు ఉంటేనే ఎమ్మెల్యే టికెట్‌.. బీజేపీ కండీషన్‌
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 115 స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించి దూకుడు మీదుంది. దాదాపు సిట్టింగ్‌లందరికీ సీట్లు ఖాయం చేసి కాంగ్రెస్‌, బీజేపీలపై ఒత్తిడి పెంచారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌. దీంతో ఆ రెండు పార్టీలు సైతం అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టాయి.

ఆశావహుల నుంచి కాంగ్రెస్‌ దరఖాస్తులు స్వీకరించింది. ఇందుకోసం ఫీజు కూడా నిర్ణయించింది. 1025 మంది కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ప్రస్తుతం అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసే పనిలో బిజీగా ఉంది. ఈ నెలాఖరుకు ఫస్ట్‌ లిస్ట్ రిలీజ్ చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఇక బీజేపీ సైతం కాంగ్రెస్‌ బాటలోనే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయితే ఎలాంటి ఫీజు లేకపోవడంతో బీజేపీకి ఊహించని రీతిలో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 6 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. దీంతో అభ్యర్థులను ఫైనల్ చేయడం ఆ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. దీంతో అభ్యర్థులకు కొన్ని కండీషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ టికెట్ కావాలంటే సోషల్ మీడియాలో కనీసం 25 వేల మంది ఫాలోవర్లు, లోక్‌సభ టికెట్ కావాలంటే కనీసం 10 వేల మంది ఫాలోవర్లు ఉండాలని షరతు విధించిందట. దీంతో ఈ కండీషన్లపై సోషల్‌మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

First Published:  21 Sep 2023 10:23 AM GMT
Next Story