Telugu Global
Telangana

బీజేపీVs టీఆరెస్: యాదాద్రిలో ఉద్రిక్త రాజకీయాలకు తెరలేపిన బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి వెళ్తున్నారు. పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ ఆయన యాదాద్రి వెళ్తున్నారు. మరో వైపు టీఆరెస్ శ్రేణులు బండి సంజయ్ కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

బీజేపీVs టీఆరెస్: యాదాద్రిలో ఉద్రిక్త రాజకీయాలకు తెరలేపిన బండి సంజయ్
X

టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు చేసిన కుట్ర నేపథ్యంలో ఆ కుట్రతో తమకు సంబంధంలేదని చెప్పుకోవడానికి బీజేపీ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. మొదట... హిందూ స్వామీజీలపై కేసులు నమోదు చేస్తారా? అని ప్రశ్నించిన బండి సంజయ్ ఇది హిందువులపై జరుగుతున్న కుట్ర అని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నందకుమార్ అనే నిందితుడితో టీఆరెస్ నాయకులు కూడా ఫోటోలు దిగారని ప్రచారం మొదలు పెట్టారు. బండి సంజయ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అదే వాదనలు వినిపించారు.

ఇక అతర్వాత... అసలు టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ కుట్ర జరగనే లేదని, ఇదంతా కేసీఆర్ కుట్ర అంటూ కొత్త రాగం అందుకుంది బీజేపీ. బండి సంజయ్ అక్కడితో ఆగకుండా యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామి ముందు ప్రమాణం చేద్దాం రమ్మంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు. అక్కడి నుంచి...ఈ వ్యవహారాన్ని జనాలను రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యగా మార్చే ప్రయత్నానికి పూనుకున్నారు.

ఫార్మ్ హౌజ్ కుట్ర వ్యవహారంపై మండి పడుతున్న టీఆరెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పూనుకున్న నేపథ్యంలో యాదాద్రికి వెళ్ళడానికి రడీ అయ్యారు. శాంత్రి భద్రతల సమస్య వస్తుందని పోలీసులు సంజయ్ యాదాద్రి వెళ్ళడానికి అనుమతి నిరాకరించారు. మరొ వైపు యాదాద్రిలో టీరెస్ శ్రేణులు నిరసనలకు దిగారు. నల్ల జెండాలతో బీజేపీ వ్యతిరేక ప్రదర్శనలు చేస్తున్నారు.

ఈ క్రమంలో యాదాద్రికి రావద్దని బండి సంజయ్ కి పోలీసులు చెప్పారు. అయితే పోలీసుల మాటను పెడచెవినపెట్టిన సంజయ్ యాదాద్రికి బయలుదేరారు.

కొద్ది సేపట్లో బండి సంజయ్ ఆయన అనుచరులతో కలిసి యాదాద్రి చేరుకోనున్నారు. అక్కడ్ అటీఆరెస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. మరో వైపు సంజయ్ ను ఆపడానికి పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ప్రస్తుతం యాదాద్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

కాగా మునుగోడు ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టి గొడవలు రేపి మునుగోడులో లాభపడాలన్న ఉద్దేశంతోనే సంజయ్ యాదాద్రికి వెళ్తున్నాడని మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన బీజేపీ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండి పడ్డారు.

First Published:  28 Oct 2022 7:58 AM GMT
Next Story