Telugu Global
Telangana

కేటీఆర్ ఛాలెంజ్.. బీజేపీ సైలెన్స్

బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తెలంగాణ కంటే వెనకబడే ఉన్నాయని గుర్తు చేశారు కేటీఆర్. సమాధానం లేకనే బీజేపీ సైలెంట్ గా ఉందని ఇప్పుడు మరోసారి తన ట్వీట్ లో ప్రస్తావించారు.

కేటీఆర్ ఛాలెంజ్.. బీజేపీ సైలెన్స్
X

వందేభారత్ రైలు ప్రారంభోత్సవం కోసం ఇటీవల ప్రధాని మోదీ తెలంగాణ వచ్చిన సందర్భంగా కేటీఆర్ ఓ ట్వీట్ వేసి ఛాలెంజ్ చేశారు. గడచిన 9 ఏళ్లలో ఏ రాష్ట్రం తెలంగాణ కంటే ఎక్కువగా అభివృద్ధి చెందిందో చెప్పాలని సవాల్ విసిరారు. 9 ఏళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ఆయన వివరించారు. ఈనెల 9న కేటీఆర్ ఈ ట్వీట్ వేశారు, కానీ బీజేపీ నుంచి ఎలాంటి సమాధానం లేదు. అంటే వారి వద్ద సమాధానమే లేదని చెప్పాలి. బీజేపీ సైలెన్స్ ని గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్ మరో సారి ట్వీట్ వేశారు. ప్రధాని మోదీ కానీ, బీజేపీ నుంచి ఏ ఇతర బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి కానీ తన ఛాలెంజ్ కి స్పందించలేదని అన్నారు కేటీఆర్.

సమాధానం లేకనే..

గడచిన 9ఏళ్లలో తెలంగాణ ఏయే రంగాల్లో అభివృద్ధి చెందిందో వివరిస్తూ కేటీఆర్ 18 బుల్లెట్ పాయింట్లు ప్రస్తావించారు. ఆయా రంగాల్లో తెలంగాణను తలదన్నే రాష్ట్రం ఏదీ లేదన్నారు. ఒకవేళ ఉంటే ఆ పేరేంటో చెప్పండి అంటూ ప్రధానిని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తెలంగాణ కంటే వెనకబడే ఉన్నాయని గుర్తు చేశారు కేటీఆర్. సమాధానం లేకనే బీజేపీ సైలెంట్ గా ఉందని ఇప్పుడు మరోసారి తన ట్వీట్ ద్వారా గుర్తు చేశారు కేటీఆర్.


వివక్ష చూపిస్తున్నా..

గడచిన 9 ఏళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి చూపిస్తూ.. అదే సమయంలో కేంద్రం చూపెట్టిన వివక్షని కూడా ఎండగట్టారు కేటీఆర్. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం ప్రోత్సాహం ఏమీ లేదన్నారు. విభజన హామీలను అమలు చేయకపోవడం సహా.. 9 ఏళ్లలో తెలంగాణకు కొత్త ప్రాజెక్ట్ లు ఇవ్వలేదు. అప్పటికే ఉన్న హామీలను అమలు చేయలేదు. ఒకరకంగా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్రం సవతితల్లి ప్రేమను చూపించింది. ఎంత వివక్ష చూపించినా అభివృద్ధిలో బీజేపీ పాలిత రాష్ట్రాలను కూడా తెలంగాణ వెనక్కు నెట్టడం విశేషం. ఈ విషయాన్ని ఒప్పుకోలేకే బీజేపీ నోరు పడిపోయింది. మంత్రి కేటీఆర్ ట్వీట్ తో ఇది మరోసారి రుజువైంది.

First Published:  12 April 2023 4:06 AM GMT
Next Story