Telugu Global
Telangana

దిల్‌ రాజుకు బీజేపీ ఎంపీ టికెట్‌.. ఆ స్థానం నుంచే పోటీ..!

మెదక్ నుంచి రఘునందన్ రావు పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక అభ్యర్థులు లేని చోట ఆర్థికంగా, సామాజికంగా బలమైన వ్యక్తులను బరిలో దించాలని బీజేపీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

దిల్‌ రాజుకు బీజేపీ ఎంపీ టికెట్‌.. ఆ స్థానం నుంచే పోటీ..!
X

తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమైన హైకమాండ్ మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో బీజేపీ స్టేట్ చీఫ్‌ కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, డి.కె.అరుణ హాజరయ్యారు.

ఫస్ట్‌ లిస్ట్‌లో 8 మంది అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఫస్ట్ లిస్ట్‌లో నలుగురు సిట్టింగ్ ఎంపీలు సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి అర్వింద్ పేర్లు ఉంటాయని.. ఇక మరో నాలుగు స్థానాలు మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి డి.కె.అరుణ పేర్లు ఫైనల్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

మెదక్ నుంచి రఘునందన్ రావు పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక అభ్యర్థులు లేని చోట ఆర్థికంగా, సామాజికంగా బలమైన వ్యక్తులను బరిలో దించాలని బీజేపీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రముఖ నిర్మాత దిల్‌రాజును జహీరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేయించేందుకు బీజేపీ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దిల్‌ రాజు సొంత జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. ఈ జిల్లా పరిధిలోని పలు నియోజకవర్గాలు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి.

First Published:  24 Feb 2024 3:28 PM GMT
Next Story