Telugu Global
Telangana

కోమటిరెడ్డి, ఉత్తమ్ తలుచుకుంటే.. అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ ఎన్నికలు కాగానే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయమన్నారు. తెలంగాణతో పాటు దేశంలో అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు కూలిపోతాయంటూ అర్వింద్ జోస్యం చెప్పారు.

కోమటిరెడ్డి, ఉత్తమ్ తలుచుకుంటే.. అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
X

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ అర్వింద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు గట్టిగా కోరుకుంటే నెల రోజుల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి తలుచుకుంటే ఇప్పుడంటే ఇప్పుడే ప్రభుత్వం పడిపోతుందని సంచలన కామెంట్స్ చేశారు.

కాంగ్రెస్ సర్కారును ఎవరూ కూల్చాల్సిన అవసరం లేదని, ఆ పార్టీ నేతలే కూల్చుకుంటారన్నారు అర్వింద్. పార్లమెంట్ ఎన్నికలు కాగానే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయమన్నారు. తెలంగాణతో పాటు దేశంలో అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు కూలిపోతాయంటూ అర్వింద్ జోస్యం చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు హామీల ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు అర్వింద్. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్‌కు పసుపు బోర్డు తీసుకొచ్చానని అన్నారు. రాష్ట్రం సహకరిస్తే జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టు ఏడాదిలోపు తెరుచుకోవచ్చన్నారు. రేవంత్ సర్కారు అవినీతి వల్లే పనులు కావట్లేదని ఫైర్ అయ్యారు. ఐదేళ్లలో ఎంపీగా తనపై ఒక్క అవినీతి ఆరోపణ లేదన్న అర్వింద్.. ఆ రోజు వస్తే రాజకీయాలను వదిలేస్తానన్నారు.

First Published:  10 May 2024 8:58 AM GMT
Next Story