Telugu Global
Telangana

బీజేపీ మేనిఫెస్టో విడుదల.. కీలక అంశాలు ఇవే

ఆసక్తిగల రైతులకు ఉచితంగా దేశీ ఆవుల పంపిణీ ఈ మేనిఫెస్టోలో బీజేపీ మార్క్ హామీ. వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ క్షేత్రాల సందర్శన పథకం కూడా కాషాయం మార్క్ ని ప్రతిబింబిస్తోంది.

బీజేపీ మేనిఫెస్టో విడుదల.. కీలక అంశాలు ఇవే
X

సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో బీజేపీ మేనిఫెస్టో విడుదలైంది. మన మోదీ గ్యారెంటీ బీజేపీ భరోసా అనే స్లోగన్ కూడా దీనికి జత చేర్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టోలకు భిన్నంగా ఇందులో పథకాలున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ మేనిఫెస్టోని విడుదల చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు చక్కగా అమలవుతాయన్నారు అమిత్ షా. బీసీ ముఖ్యమంత్రి అనేదే కీలక హామీగా ఈ మేనిఫెస్టో రూపొందించారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, డీజిల్, పెట్రోల్ పై వ్యాట్ తగ్గింపు వంటి ఆకర్షణలు కూడా ఇందులో ఉన్నాయి.


బీజేపీ మేనిఫెస్టోలో ప్రధాన హామీలు..

బీసీ ముఖ్యమంత్రి..

ధరణికి బదులు మీ భూమి యాప్‌

పెట్రోల్‌, డీజిల్‌ పై వ్యాట్‌ తగ్గింపు.

ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి 4 గ్యాస్‌ సిలిండర్లు ఫ్రీ

నిజాం ఘుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణ

బీఆర్ఎస్ ప్రభుత్వం కుంభకోణాలపై విచారణకు కమిటీ

గల్ఫ్‌ బాధితుల కోసం ప్రత్యేక నోడల్‌ ఏజెన్సీ

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా 1వతేదీన వేతనాలు, పెన్షన్లు

మత రిజర్వేషన్లు తొలగించి.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపు

ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా కమిటీ ఏర్పాటు

అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్‌ కార్డులు

ఎరువులు, విత్తనాల కొనుగోలు కోసం రూ.2,500 ఇన్‌ పుట్‌ సబ్సిడీ

రైతులకు ఉచిత పంటల బీమా

వరికి రూ.3,100 మద్దతు ధర

నిజామాబాద్‌ ను టర్మరిక్‌ సిటీగా అభివృద్ధి చేసే ప్రణాళిక

మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు

మహిళా రైతుల కోసం మహిళా రైతు కార్పొరేషన్‌

వైద్య శ్రీలో భాగంగా అర్హత కలిగిన కుటుంబాలకు ఏడాదికి రూ.10 లక్షల ఆరోగ్య బీమా

ఎస్సీ వర్గీకరణకు సహకారం

మేడారం జాతర జాతీయ స్థాయిలో నిర్వహణ

బీజేపీ మార్క్ హామీలు..

ఆసక్తిగల రైతులకు ఉచితంగా దేశీ ఆవుల పంపిణీ ఈ మేనిఫెస్టోలో బీజేపీ మార్క్ హామీ. వయోవృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ క్షేత్రాల సందర్శన పథకం కూడా కాషాయం మార్క్ ని ప్రతిబింబిస్తోంది. గో హత్య నిషేధ చట్టం తెలంగాణలో అమలు చేస్తామంటోంది బీజేపీ. గోవుని చంపితే గరిష్టంగా ఏడేళ్లు జైలు శిక్షతోపాటు రూ.5లక్షల జరిమానా కూడా విధిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.



First Published:  18 Nov 2023 2:55 PM GMT
Next Story