Telugu Global
Telangana

'మోదీ గ్యారెంటీ'..! బీజేపీ మేనిఫెస్టో పేరు ఇదే

ఎన్నికలకింకా 15రోజులే టైమ్ ఉంది. ఈలోగా ప్రజలకు మేనిఫెస్టోని వివరించాల్సి ఉంటుంది బీజేపీ అభ్యర్థులు. అందుకే వారు హడావిడిపడుతున్నారు.

మోదీ గ్యారెంటీ..! బీజేపీ మేనిఫెస్టో పేరు ఇదే
X

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ఫుల్ మేనిఫెస్టో విడుదల చేసింది, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో సగం మేనిఫెస్టో బయటపెట్టింది, ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. బీసీ సీఎం అంటూ అతి పెద్ద హామీ ఇచ్చింది కానీ, మేనిఫెస్టో ఇంకా విడుదల చేయకుండా కాలం సరిపెట్టిన బీజేపీ ఇప్పుడు రసవత్తరంగా దాన్ని వండి వార్చేందుకు సిద్ధమైంది. ఆ మేనిఫెస్టోకి మోదీ గ్యారెంటీ అనే పేరు పెట్టారట బీజేపీ నేతలు.

15రోజోలే టైమ్..

ఎన్నికలకింకా 15రోజులే టైమ్ ఉంది. ఈలోగా ప్రజలకు మేనిఫెస్టోని వివరించాల్సి ఉంటుంది బీజేపీ అభ్యర్థులు. అందుకే వారు హడావిడిపడుతున్నారు. మేనిఫెస్టో దాదాపుగా ఫైనల్ అయిందని, ఇక అధికారికంగా దాన్ని విడుదల చేయడమే తరువాయి అంటున్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కు భిన్నంగా ఈ మేనిఫెస్టో ఉంటుందని ఊదరగొడుతున్నారు.

ఏయే అంశాలు..?

ఉచిత విద్య, వైద్యంతో పాటు నిరుద్యోగులు, సామాన్యులు, రైతులకు లబ్ది చేకూర్చేలా అనేక అంశాలు బీజేపీ మేనిఫెస్టోలో ఉంటాయని అంటున్నారు. ప్రతి వ్యక్తికి బీమా పథకాన్ని అమలు చేస్తామనే హామీ కూడా ఉండొచ్చని తెలుస్తోంది. పలు నగరాల పేర్లను మార్చే ప్రస్తావన ఇదివరకే లీకైంది. రైతులకు వరి కనీస మద్దతు ధర క్వింటాకు రూ.3100కు పెంచడం, ఆయుష్మాన్ భారత్ కింద ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షలను రూ.10 లక్షల వరకు పెంచే ప్రతిపాదనలు కూడా ఉన్నాయని సమాచారం. పెళ్లయిన ప్రతి మహిళకు ఏడాదికి రూ.12వేలు ఆర్థిక సాయం. పేదలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇలా చాలా హామీలే ఇందులో పొందుపరిచారని తెలుస్తోంది. ఈ నెల 17న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో మేనిఫెస్టో విడుదల చేస్తారని తెలుస్తోంది.

First Published:  14 Nov 2023 6:28 AM GMT
Next Story