Telugu Global
Telangana

క్లైమాక్స్ లో బీజేపీ దండయాత్ర.. ఫినిషింగ్ టచ్ తో ఉపయోగం ఉందా..?

కేంద్ర మంత్రులు, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు.. ఇలా బీజేపీ అగ్రనాయకత్వం అంతా చివరి రోజుల్లో తెలంగాణలోనే మకాం వేసింది. ప్రచారంలో హడావిడి పెంచింది.

క్లైమాక్స్ లో బీజేపీ దండయాత్ర.. ఫినిషింగ్ టచ్ తో ఉపయోగం ఉందా..?
X

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలకు ముందే బీఆర్ఎస్ ప్రచారంలో దూకుడు పెంచింది. ఆ తర్వాత కాంగ్రెస్ స్పీడందుకుంది, బీజేపీ మాత్రం చివరిలో హడావిడి చేసింది. ప్రచారం ముగుస్తుందనుకున్న టైమ్ లో బీజేపీ ఢిల్లీ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి నేతల్ని హైదరాబాద్ తరలించింది. ఇతర నియోజకవర్గాలకంటే ఎక్కువగా హైదరాబాద్ పైనే ఢిల్లీ పెద్దలు ఫోకస్ పెట్టారు. గ్రేటర్ పరిధిలో సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, సాధ్వి నిరంజన్ జ్యోతి, అనురాగ్ సింగ్ ఠాకూర్, యూపీ సీఎం యోగి, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, మాజీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, యడ్యూరప్ప, జైరాం ఠాకూర్.. ఇంకా చాలామంది బీజేపీ తరపున తెలంగాణలో ప్రచారం చేశారు. ఈ ప్రచార ప్రభావం ఏమేరకు ఉంటుందో చూడాలి.

అగ్ర నేతల దండయాత్ర

హైదరాబాద్ లో భారీ రోడ్ షో సహా ప్రధాని నరేంద్రమోదీ మొత్తం 8 సభల్లో పాల్గొన్నారు. బీసీ ఆత్మగౌరవ సభ, మాదిగ ఉపకులాల విశ్వరూప సభలతో ప్రచారాన్ని హోరెత్తించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 12 సభల్లో పాల్గొన్నారు. అమిత్ షా సభల కౌంట్ 21. ఆ తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎక్కువ సభల్లో పాల్గొన్నారు. తెలంగాణలో ఆయన 8 సభలకు హాజరయ్యారు. రాజ్ నాథ్ సింగ్ 6 సభల్లో పాల్గొన్నారు.

కేంద్ర మంత్రులు, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు.. ఇలా బీజేపీ అగ్రనాయకత్వం అంతా చివరి రోజుల్లో తెలంగాణలోనే మకాం వేసింది. ఓ దశలో కాంగ్రెస్ నేతలు కర్నాటక, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ నాయకులతో ప్రచారంలో దూసుకుపోతోంది అనుకుంటే.. చివరి రెండు రోజుల్లో వారికంటే ఎక్కువగా నాయకుల్ని డంప్ చేసింది బీజేపీ. ప్రచారంలో హడావిడి పెంచింది.

First Published:  28 Nov 2023 12:45 PM GMT
Next Story