Telugu Global
Telangana

సీఎం రేసులో బండి.. వాటే జోక్

119 నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి పట్టుమని 40 చోట్ల కూడా గట్టి అభ్యర్థులు దొరకలేదు. ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించి వెతుక్కుంటున్నారు.

సీఎం రేసులో బండి.. వాటే జోక్
X

తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ఒకవైపు సీరియస్‌గా జరుగుతుంటే.. మరోవైపు బీజీపీ సీనియర్ నేత మురళీధరరావు పెద్ద జోక్ చేశారు. అదేమిటంటే.. బండి సంజయ్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారట. బండి సీఎం రేసులో ఉన్నారు కాబట్టే కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోవటంలో తప్పులేదు. కానీ, అది ఎప్పుడు జరుగుతుందంటే ముందు పార్టీలో అధికారంలోకి వచ్చినప్పుడు కదా.

బీజేపీ అధికారంలోకి వచ్చేంత సీన్ లేదని తెలిసినా కూడా ఇంకా ముఖ్యమంత్రి రేసని చెబుతున్నారంటే అది జోక్ కాక మరేమిటి. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి పట్టుమని 40 చోట్ల కూడా గట్టి అభ్యర్థులు దొరకలేదు. ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించి వెతుక్కుంటున్నారు. అయినా గట్టి అభ్యర్ధులు దొరకటంలేదు. అందుకనే మొదటి జాబితా అని రెండో జాబితాని ఏదేదో మాట్లాడుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ను కాదని బీజేపీలో చేరిన నేతల్లో చాలామంది మళ్ళీ కాంగ్రెస్ లో చేరిపోతున్నారు.

ఏ కోణంలో చూసినా బీజేపీలో జోష్ కనబడటంలేదు. ఒకప్పుడు బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని అనుకునే దశలో పార్టీ ఉండేది. ఇప్పుడు పార్టీ గురించి పట్టించుకుంటున్న నాథులే లేరు. ఒంటరిగా పోటీచేసే ధైర్యం లేక అసలు ఉనికిలో కూడా లేని జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఇక కరీంనగర్‌లో పోటీచేస్తున్న బండి సంజయ్ గెలుస్తారో.. లేదో.. తెలీదు. గెలుపు కోసం బండి నానా అవస్థ‌లు పడుతున్నారు. గ‌త ఎన్నికల్లో ఎంపీగా గెలిచినా.. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవటానికి ఆపసోపాలు పడుతున్నారు.

పార్టీకి ఊపుంటేనే బండికి గెలిచే ఛాన్సుంటుంది.. లేకపోతే లేదని అందరికీ తెలుసు. అలాంటిది గెలుస్తారో.. లేదో కూడా తెలీని బండి ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్లు మురళీధర రావు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. పైగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్నారంతే.. ఇప్పుడు మురళీ ఏమో బండి రేసులో ఉన్నట్లు చెప్పేశారు. మరి ఈటల, ధర్మపురి అర్వింద్ లాంటి నేతల పేర్లు ఎందుకు చెప్పలేదో..?

First Published:  7 Nov 2023 3:48 AM GMT
Next Story