Telugu Global
Telangana

సంక్షేమంలో కేసీఆర్‌ను కొట్టలేం.. బీజేపీ నేత పొగడ్తలు

కేసీఆర్‌ను కొట్టాలంటే.. ఆయన ఇచ్చిన హామీలు, వాటి అమలు విషయంలో మాత్రమే ఇరకాటంలో పెట్టాలని.. ఆ తేడాను ఇష్యూగా మార్చి ప్రజలకు వివరించగలిగితేనే సక్సెస్‌ అవుతామన్నారు.

సంక్షేమంలో కేసీఆర్‌ను కొట్టలేం.. బీజేపీ నేత పొగడ్తలు
X

సీఎం కేసీఆర్‌ రాజకీయ వ్యూహాలు రచించడంలో దిట్ట. ప్రత్యర్థులు సైతం కొన్ని సందర్భాల్లో ఆయన్ను మెచ్చుకోక తప్పనిపరిస్థితి ఉంటుంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌ మురళీధర్‌ రావు.. కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్షేమం విషయంలో సీఎం కేసీఆర్‌ను కొట్టలేమన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ తరహాలోనే.. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ కూడా సంక్షేమంలో ముందుంటారని చెప్పారు. కేసీఆర్‌ను కొట్టాలంటే.. ఆయన ఇచ్చిన హామీలు, వాటి అమలు విషయంలో మాత్రమే ఇరకాటంలో పెట్టాలని.. ఆ తేడాను ఇష్యూగా మార్చి ప్రజలకు వివరించగలిగితేనే సక్సెస్‌ అవుతామన్నారు. లేదంటే కేసీఆర్‌ను ఓడించడం చాలా కష్టమన్నారు

ఇక తెలంగాణలో యూత్‌ చాలా ఎక్కువని.. దాదాపు 65 శాతం యువత ఉంటారన్నారు మురళీధర్‌ రావు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య, పేపర్ లీకేజీ సమస్యలు ఉన్నాయని..యూత్‌కు అండగా నిలబడితే కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టొచ్చన్నారు. వచ్చే ఎన్నికల్లో యూత్‌ గేమ్‌ ఛేంజర్లుగా ఉంటారన్నారు. యూత్‌ ఓట్లు ఎవరికి పడితే వాళ్లదే అధికారమన్నారు

ఇక బండి సంజయ్‌ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడంపైనా కామెంట్స్ చేశారు మురళీధర్‌ రావు. ఎన్నికలకు తక్కువ టైం ఉన్న నేపథ్యంలో కొన్ని పెద్ద తలలు వస్తాయి కాబట్టి వారిని కలుపుకుపోవడంలో ఇబ్బందులు తలెత్తొచ్చనే భావనతోనే ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో తాను మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు చెప్పారు మురళీధర్‌ రావు

First Published:  18 Aug 2023 5:40 PM GMT
Next Story