Telugu Global
Telangana

బీఆర్ఎస్ పేరు చెబితే ఉలిక్కిపడుతున్న బీజేపీ

బీఆర్ఎస్ అధికారిక ప్రకటన ఇంకా జరగలేదు. అంతలోనే బీజేపీ ఉలిక్కిపడుతోంది. నాయకులు చేజారిపోతారేమోనని భయపడుతోంది.

బీఆర్ఎస్ పేరు చెబితే ఉలిక్కిపడుతున్న బీజేపీ
X

బీఆర్ఎస్ టార్గెట్ బీజేపీ అనేది బహిరంగ రహస్యం. అయితే బీజేపీ ఇప్పటి వరకూ గుంభనంగా ఉంది. కానీ ఇప్పుడు బయటపడిపోయింది, తన భయాల్ని బయటపెట్టుకుంది. బీఆర్ఎస్ ఏర్పాటుతో బీజేపీకి భంగపాటు తప్పదనే అంచనాకు వచ్చింది. కేంద్రంలో బీజేపీని అధికారంలోనుంచి దించుందా లేదా అనేది తేలాలంటే ఇంకో రెండేళ్ల టైమ్ ఉంది. ఆలోగా బీజేపీకి వలసల రూపంలో నష్టం జరిగే అవకాశముంది. బీఆర్ఎస్‌లోకి బీజేపీ నేతలు క్యూ కడతారంటూ ఇటీవల పత్రికల్లో వచ్చిన కథనాలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తమ పార్టీ నుంచి ఒక్కరు కూడా బీజేపీలోకి పోరు అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అలా వెళ్తే తన ముక్కు నేలకు రాస్తానంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ నుంచి తలకు మాసినోళ్లు దొరుకుతారమో కానీ, బీజేపీ నేతలు మాత్రం బీఆర్ఎస్‌లోకి వెళ్లరని అన్నారు.

అంత ఉలుకెందుకు..?

బీఆర్ఎస్ అధికారిక ప్రకటన ఇంకా జరగలేదు. అంతలోనే బీజేపీ ఉలికిపడుతోంది. నాయకులు చేజారిపోతారేమోనని భయపడుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి బీఆర్ఎస్ వల్ల భారీ నష్టం జరిగే అవకాశముంది. బీజేపీలో అసంతృప్తులు బీఆర్ఎస్‌లోకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. అటు టీఆర్ఎస్ నేతలు కూడా జాతీయ పార్టీ పెడితే తమతో కలసి పనిచేసేందుకు టీడీపీ, బీజేపీ నేతలు కొంతమంది రెడీగా ఉన్నారని, వారంతా తమతో టచ్‌లో ఉన్నారని లీకులిస్తున్నారు. ఈ లీకులతో బీజేపీ కుమిలిపోతోంది.

బీజేపీకి వలసల భయం పట్టుకుందా..? బీఆర్ఎస్‌లోకి బీజేపీ నేతలు వెళ్లిపోతారనుకుంటున్నారా..? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి నష్టం తప్పదా..? సత్యకుమార్ ట్వీట్ మాత్రం వీటన్నిటినీ రుజువు చేస్తోంది. ఏపీలో టీడీపీని దెబ్బకొట్టి ప్రతిపక్షంలోకి రావాలనేది బీజేపీ ప్లాన్. తెలంగాణలో కూడా మిగిలిపోయిన టీడీపీ క్యాడర్‌ని ఒడిసి పట్టుకోవాలనే ఆలోచనలో ఉంది బీజేపీ. కానీ బీఆర్ఎస్ రాకతో టీడీపీ నేతలు అటువైపు చూస్తున్నారని అంటున్నారు. అంటే పరోక్షంగా అది బీజేపీకి నష్టం. బీజేపీ నేతలు కూడా కొంతమంది తమతో టచ్‌లో ఉన్నారని టీఆర్ఎస్ నేతలు చెప్పడం, కేసీఆర్ కూడా కొందరితో నేరుగా టచ్‌లోకి వెళ్లారనే వార్తలు రావడంతో బీజేపీలో భయం మరింత పెరిగింది. దీంతో ముందుగానే తమలోని అభద్రతా భావాన్ని ఇలా బయటపెట్టుకుంటున్నారు.

First Published:  4 Oct 2022 11:51 AM GMT
Next Story