Telugu Global
Telangana

అభ్య‌ర్థులు తేలలేదు గానీ.. ప్ర‌చారానికి మూడు హెలికాప్ట‌ర్లా..?

బీజేపీ తెలంగాణ‌లో అధికారం ద‌క్కించుకోలేద‌న్న‌ది సుస్ప‌ష్టం. బీఆర్ఎస్‌, కాంగ్రెస్ మ‌ధ్య‌లోనే పోటీ అని సాక్షాత్తూ అధికార పార్టీ అగ్ర‌నేత‌లే ఒప్పుకుంటున్నారు.

అభ్య‌ర్థులు తేలలేదు గానీ.. ప్ర‌చారానికి మూడు హెలికాప్ట‌ర్లా..?
X

ఒక‌ద‌శ‌లో తెలంగాణ‌లో బీఆర్ఎస్‌కు తామే ప్ర‌ధాన పోటీ అన్న స్థాయిలో ప్ర‌చారంలోకి వ‌చ్చిన బీజేపీ.. హ‌ఠాత్తుగా వెన‌క‌బ‌డిపోయింది. ఇప్పుడు నామినేష‌న్లు మొద‌ల‌యి రెండు రోజులు అయినా ఇంకా పూర్తిస్థాయిలో అభ్య‌ర్థుల‌ను కూడా ప్ర‌క‌టించ‌లేదు. ప్ర‌కటించిన అభ్య‌ర్థులు ఎంత‌మంది గెలుపు గుర్రాలున్నారు అన్న‌ది ప‌క్క‌న పెడితే ప్ర‌చారానికి బీజేపీ చేస్తున్న హంగామా మాత్రం మామూలుగా లేదు.

ప్ర‌ధాని, హోం మంత్రితో మీటింగ్‌లు

బీజేపీ తెలంగాణ‌లో అధికారం ద‌క్కించుకోలేద‌న్న‌ది సుస్ప‌ష్టం. బీఆర్ఎస్‌, కాంగ్రెస్ మ‌ధ్య‌లోనే పోటీ అని సాక్షాత్తూ అధికార పార్టీ అగ్ర‌నేత‌లే ఒప్పుకుంటున్నారు. కానీ, బీజేపీ మాత్రం ఇప్ప‌టికే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో స‌భ‌లు పెట్టించింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నడ్డా ఇలా అగ్ర‌నేత‌లు వ‌చ్చి వెళుతున్నారు. ఈనెల‌లో ప్ర‌ధాని మోడీ రెండు స‌భ‌ల్లో పాల్గొన‌బోతున్నారు. అయితే ఈ ప్ర‌చార హ‌డావుడి త‌ప్ప రాష్ట్రంలో శ్రేణుల్లో పెద్ద‌గా ఊపు క‌న‌ప‌డ‌టం లేదు. ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల ప్ర‌చార‌మూ ఇంకా ఊపందుకోలేదు.

బండి సంజ‌య్, ఈటల‌కు రెండు హెలికాప్ట‌ర్లు

ఇదిలా ఉండ‌గా.. తెలంగాణ‌ శాసన సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ అధిష్టానం మూడు హెలికాప్టర్లను సమకూర్చుకుంది. ఇందులో కీల‌క నేత‌లు బండి సంజ‌య్‌, ఈట‌ల రాజేంద‌ర్‌కు రెండు హెలికాప్ట‌ర్లు ఇస్తోంది. ముఖ్యనేతలు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేందుకు వీటిని ఉపయోగించాలని నిర్ణయించారు. ఎన్నికల్లో పోటీచేస్తున్న బండి సంజయ్, ఈటల రాజేందర్లకు ఇత‌ర ప్రాంతాల్లో కూడా ప్ర‌చారం చేయ‌డానికి వీటిని వాడాల‌ట‌..! మరో హెలికాప్ట‌ర్‌ను రాష్ట్ర నేతలు ప్రచారానికి ఉపయోగించుకుంటార‌ని పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ క‌దా.. గెలిచే ప‌రిస్థితి ఉన్నా.. లేక‌పోయినా ఆ మాత్రం హంగామా లేక‌పోతే ఎలా అని విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.

First Published:  4 Nov 2023 7:48 AM GMT
Next Story