Telugu Global
Telangana

52 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల

తెలంగాణ ఎన్నికల్లో బీసీ, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది.

52 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల
X

52 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సంబంధించి బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ మేరకు 52 మంది అభ్యర్థులకు ఆమోద ముద్ర వేసింది. కేంద్ర కమిటీ సభ్యులైన హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బి.ఎల్. సంతోష్‌తో పాటూ కమిటీ సభ్యులైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ శనివారం రాత్రి ప్రధాని మోడీతో విస్తృతంగా చర్చలు జరిపారు.

తెలంగాణ ఎన్నికల్లో బీసీ, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు తొలి జాబితాలోనే 12 మంది మహిళలకు టికెట్లు ఇచ్చింది. మరోవైపు బీజేపీ నుంచి సస్పెండ్ అయిన రాజాసింగ్‌కు తొలి జాబితాలోనే గోషామహల్ నుంచి టికెట్ కేటాయించారు. ఆదివారం ఉదయమే ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తేశారు. ఆ వెంటనే ఆయనకు టికెట్ కేటాయించడం గమనార్హం.

ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల నుంచి, బండి సంజయ్ కుమార్ కరీంనగర్ నుంచి, సోయం బాపూరావు బోథ్ నుంచి పోటీ చేయనున్నారు. ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నారు. అయితే హుజూరాబాద్ నుంచి ఏ అభ్యర్థినీ ప్రకటించలేదు.

ఇదే బీజేపీ తొలి లిస్టు..


Sl Legislative Assembly Name of Candidate
Constituency No. & Name
1 1 Sirpur Dr. Palvai Harish Babu
2 3 Bellampalli (SC) Smt. Amarajula Sridevi
3 6 Khanapur (ST) Shri Ramesh Rathod
4 7 Adilabad Shri Payal Shankar
5 8 Boath (ST) Shri Soyam Bapu Rao, MP
6 9 Nirmal Shri Aleti Maheshwar Reddy
7 10 Mudhole Shri Ramarao Patel
8 11 Armur Shri Paidi Rakesh Reddy
9 13 Jukkal (SC) Kum. T Aruna Tara
10 16 Kamareddy Shri K Venkata Ramana Reddy
11 17 Nizamabad Urban Shri Dhanpal Suryanaryana Gupta
12 19 Balkonda Smt. Annapurnamma Aleti
13 20 Koratla Shri Dharmapuri Arvind, MP
14 21 Jagtial Smt. Dr Boga Sravani
15 22 Dharmapuri (SC) Shri S Kumar
16 23 Ramagundam Smt. Kandula Sandhya Rani
17 26 Karimnagar Shri Bandi Sanjay Kumar, MP
18 27 Choppadandi (SC) Smt. Bodiga Shobha
19 29 Sircilla Smt. Rani Rudrama Reddy
20 30 Manakondur (SC) Shri Arepalli Mohan
21 31 Huzurabad Shri Eatala Rajender
22 37 Narsapur Shri Erragolla Murali Yadav
23 40 Patancheru Shri T Nandhishwar Goud
24 41 Dubbak Shri Madavaneni Raghunandan Rao
25 42 Gajwel Shri Eatala Rajender
26 45 Quthbullapur Shri Kuna Srisailam Goud
27 48 Ibrahimpatnam Shri Nomula Dayanand Goud
28 50 Maheshwaram Shri Andela Sri Ramulu Yadav
29 60 Khairatabad Shri Chinthala Ramachandra Reddy
30 64 Karwan Shri Amar Singh
31 65 Goshamahal Shri T Raja Singh
32 66 Charminar Smt. Megha Rani
33 67 Chandrayangutta Shri Satyanarayana Mudiraj
34 68 Yakutpura Shri Veerender Yadav
35 69 Bahdurpura Shri Y. Naresh Kumar
36 83 Kalwakurthy Shri Thalloju Achary
37 85 Kollapur Shri Aelleni Sudhakar Rao
38 87 Nagarjuna Sagar Smt. Kankanala Niveditha Reddy
39 91 Suryapet Shri Sankineni Venkateshwar Rao
40 94 Bhongir Shri Gudur Narayana Reddy
41 96 Thungathurthy (SC) Shri Kadiyam Ramchandraiah
42 98 Jangaon Dr. Arutla Dashmanth Reddy
43 99 Ghanpur Station (SC) Dr. Gunde Vijaya Ramarao
44 100 Palakurthi Shri Lega Ramohan Reddy
45 101 Dornakal (ST) Smt. Bhukya Sangeetha
46 102 Mahabubabad (ST) Shri Jathoth Hussain Naik
47 105 Warangal West Smt. Rao Padma
48 106 Warangal East Shri Errabelli Pradeep Rao
49 107 Wardhannapet (SC) Shri Kondeti Sridhar
50 108 Bhupalpalle Smt. Chandupatla Keerthi Reddy
51 111 Yellandu (ST) Shri Ravindra Naik
52 119 Bhadrachalam (ST) Shri Kunja Dharma Rao


First Published:  22 Oct 2023 7:52 AM GMT
Next Story