Telugu Global
Telangana

బీజేపీ అభ్యర్థుల ఫస్ట్‌ లిస్ట్‌.. ఓవైసీకి పోటీగా మహిళా అభ్యర్థి

తెలంగాణలోనూ 9 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది. నాలుగింట మూడు సిట్టింగ్‌ స్థానాల్లో మరోసారి పాతవారికే అవకాశమిచ్చింది.

బీజేపీ అభ్యర్థుల ఫస్ట్‌ లిస్ట్‌.. ఓవైసీకి పోటీగా మహిళా అభ్యర్థి
X

లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం పూరించింది కమలదళం. మొత్తం 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ప్రధాని మోడీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో బీజేపీ కేంద్రం ఎన్నికల కమిటీ.. 16 రాష్ట్రాల్లో అభ్యర్థిత్వాలపై సుదీర్ఘ చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

రాష్ట్రాల వారీగా అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లోని - 27 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. మధ్యప్రదేశ్‌- 24, గుజరాత్‌- 15, రాజస్థాన్‌ -15, కేరళ-12, తెలంగాణ-9, జార్ఖండ్‌-11, ఛత్తీస్‌గడ్‌-12, ఢిల్లీ-5, జమ్మూకశ్మీర్‌-2, ఉత్తరాఖండ్‌-3, అరుణాచల్‌ ప్రదేశ్‌-2, గోవా-1, త్రిపుర-1, అండమాన్‌ నికోబార్‌-1, డామన్‌ డయ్యూ లోని ఒక్క స్థానానికి అభ్యర్థులను ఖరారు చేసింది.

ఫస్ట్‌ లిస్ట్‌లో 28 స్థానాల్లో మహిళలు, 47 స్థానాలు యువతకు కేటాయించింది. ఇక ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 స్థానాలు కేటాయించింది. తొలి జాబితాలో ఓబీసీలకు పెద్దపీట వేసింది బీజేపీ. మొత్తం 57 స్థానాల్లో ఓబీసీ అభ్యర్థులను నిలిపింది.

ఇక తెలంగాణలోనూ 9 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది. నాలుగింట మూడు సిట్టింగ్‌ స్థానాల్లో మరోసారి పాతవారికే అవకాశమిచ్చింది. ఊహించినట్లుగానే ఆదిలాబాద్‌ నుంచి ఎంపీ సోయం బాపూరావు అభ్యర్థిత్వాన్ని పెండింగ్‌లో ఉంచింది. ఇక మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్‌కు అవకాశమిచ్చి.. సస్పెన్స్‌కు తెరదించింది. ఇటీవల పార్టీలో చేరిన ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు పోతుగంటి భరత్‌ ప్రసాద్‌కు నాగర్‌కర్నూలు నుంచి అవకాశమిచ్చింది. ఇక హైదరాబాద్‌ నుంచి ఓవైసీకి పోటీగా విరించి హాస్పిటల్ ఛైర్‌పర్సన్ మాధవీలతను పోటీకి నిలిపింది.

తెలంగాణలోని 9 ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు వీరే -

కరీంనగర్ - బండి సంజయ్

నిజామాబాద్ - ధర్మపురి అరవింద్

మల్కాజ్ గిరి - ఈటల రాజేందర్

భువనగిరి - బూర నర్సయ్యగౌడ్‌

నాగర్ కర్నూల్ - భరత్ ప్రసాద్ పోతుగంటి

జహీరాబాద్ - బీబీ పాటిల్

సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి

హైదరాబాద్ - మాధవీలత

చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్ రెడ్డి

First Published:  2 March 2024 2:47 PM GMT
Next Story