Telugu Global
Telangana

తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ !

తెలంగాణ బీజేపీకి కోలుకోలేని దెబ్బపడబోతోంది.ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ టీఆరెస్ లో చేరుతుండగా, స్వామి గౌడ్, జితేందర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి లు కూడా అదే బాటలో నడవనున్నట్టు సమాచారం.

తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్  !
X

మునుగోడు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ గెలుపుకోసం పడరాని పాట్లు పడుతోంది. జాతీయ స్థాయి నాయకుల నుండి స్థానిక నాయకుల దాకా మునుగోడులో మోహరించారు. సామ,దాన,బేద, దండోపాయాలు ప్రయోగించి ఓట్లు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు.

వాళ్ళు ఒకవైపు ఏదోరకంగా కొందరిని తమపార్టీ వైపు లాక్కొని సంబరపడుతున్న క్రమంలో అంతకన్నా రెట్టింపు మంది బీజేపీ నుంచి టీఆరెస్ లోకి వెళ్ళిపోతున్నారు. మునుగోడు స్థానిక నాయకులు, కార్యకర్తలతో పాటు , రాష్ట్ర స్థాయి నాయకులు కూడా బీజేపీని వీడుతుండటంతో ఆ పార్టీ షాక్ కు గురవుతోంది.

మేధావిగా గుర్తింపు పొందిన దాసోజు శ్రవణ్ బీజేపీకి రాజీనామా చేశారు. మరి కొద్ది సేపట్లో కేటీఆర్ సమక్షంలో టీఆరెస్ లో చేరబోతున్నారు. మరో ముఖ్య నేత స్వామి గౌడ్ కూడా బీజేపీకి రాజీనామా చేస్తూ బండి సంజయ్ కి లేఖ రాశారు. ఆయన కూడా టీఆరె లో చేరబోతున్నారు. బూర నర్సయ్య గౌడ్ బీజేపీ లో చేరడంతో ఇక మునుగోడులో గౌడ‌ ఓట్లన్నీ తమకే అని పండగ చేసుకున్న బీజేపీకి ఆ ఆనందం కొద్ది సేపు కూడా ఉంచకుండా ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ బీజేపీకి రాజీనామా చేసి టీఆరెస్ లో చేరాడు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మునుగోడు స్థానికుడు పల్లె రవి కుమార్ గౌడ్ , ఆయన భార్య చండూరు మడలాధ్యక్షురాలు కూడా టీఆరెస్ లో చేరారు. ఇప్పుడు స్వామి గౌడ్ కూడా టీఆరెస్ లో చేరబోతున్నారు. స్వామి గౌడ్ ఒకప్పుడు శాసనమండలి చైర్మెన్ గా కూడా పని చేశారు. వీరంతా తెలంగాణ ఉద్యమంలో పని చేసినవారే.

ఇక ఒకప్పుడు టీఆరెస్ లో ఉండి ఆ తర్వాత బీజేపీలో చేరిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిలు కూడా టీఆరెస్ లోలు చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్టు సమాచారం. వీరు టీఆరెస్ అధినాయకత్వంతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

వీరంతా కొంత కాలంగా బీజేపీలో ఉన్నప్పటికీ సరైన ప్రాధాన్యత దక్కక అసంత్రుప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఆ పార్టీ లో సాగుతున్న ముఠా కొట్లాటలతో విసిగిపోయినట్టు సమాచారం.

వీళ్ళే కాకుండా మరి కొద్ది రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలనుంచి ఇంకొందరు ముఖ్యనేతలు టీఆరెస్ లో చేరబోతున్నట్టు, అందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.



First Published:  21 Oct 2022 10:10 AM GMT
Next Story