Telugu Global
Telangana

తెలంగాణకు నమ్మక ద్రోహం.. బీజేపీ ఇచ్చిన 100 అబద్దపు హామీలు ఇవే..

ఇవ్వాళ దేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ మళ్లీ ఎర్రకోటపై ఏయే రాష్ట్రాలకు ఎంత సాయం చేసింది చెబుతారు. ఇందులో ఈ వాగ్దానాలు మళ్లీ రిపీట్ అవుతాయి. అందులో ఒకటి కూడా నెరవేర్చకపోయినా.. అన్నీ పూర్తయ్యాయని చెప్పుకుంటారు.

తెలంగాణకు నమ్మక ద్రోహం.. బీజేపీ ఇచ్చిన 100 అబద్దపు హామీలు ఇవే..
X

తెలంగాణ తిరిగి పుట్టిన రోజునే.. కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ మొదలైంది. తెలంగాణ రాక మునుపు, వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఇది చేస్తాం.. అది చేస్తామంటూ వెయ్యిన్నొక్క వాగ్దానాలు ఇచ్చారు. అవన్నీ రికార్డుల్లో ఉన్నాయనే విషయం ఇంత వరకు బీజేపీ పాలకులకు తెలియలేదేమో. కేంద్ర మంత్రుల నుంచి మొదలు పెడితే.. ప్రధాని మోడీ వరకు వరాల జల్లులు కురిపించారు. అలాంటివి 100 వాగ్దానాలు ఉన్నాయి.. కానీ ఒక్కటి కూడా నెరవేరలేదు.

ఇవ్వాళ దేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ మళ్లీ ఎర్రకోటపై ఏయే రాష్ట్రాలకు ఎంత సాయం చేసింది చెబుతారు. ఇందులో ఈ వాగ్దానాలు మళ్లీ రిపీట్ అవుతాయి. అందులో ఒకటి కూడా నెరవేర్చకపోయినా.. అన్నీ పూర్తయ్యాయని చెప్పుకుంటారు. అసలు తెలంగాణతో పాటు దేశానికి బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ ఇచ్చి, నెరవేర్చని 100 హామీలు ఏంటో కింద చదివి తెలుసుకుందాం.

1. నారాయణ్‌పేట్‌లో బీజేపీ ప్రభుత్వం హ్యాండ్లూమ్ పార్క్ మంజూరు చేస్తాం.

- హోం మంత్రి అమిత్ షా

2. కాజీపేటలో కచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేస్తాం.

- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

3. ఆదిలాబాద్‌లో సిమెంట్ ప్లాంట్ నిర్మిస్తాం.

- హోం మంత్రి అమిత్ షా

4. తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మిస్తాం.

- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

5. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తాం.

- కేంద్ర మంత్రులు దివంగత సుష్మా స్వరాజ్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

6. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మించడానికి బీజేపీ సిద్ధంగా ఉంది.

- బీజేపీ నాయకుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

7. ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తాం.

- మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

8. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం.

- రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎంపీ ధర్మపురి అరవింద్

9. తెలంగాణలో కేంద్రమే గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుంది.

- బీజేపీ నాయకుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

10. తెలంగాణలో సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటు చేయడానికి అనుమతులు మంజూరు చేస్తాం.

- కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి (ట్వీట్టర్‌లో హామీ)

11. తెలంగాణలో వరద సాయం అందిస్తాం. కేంద్రం ఇప్పటికే దీనికి అంగీకరించింది.

- కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

12. తెలంగాణలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఏర్పాటు చేయడమే నా కల.

- ప్రధాని నరేంద్ర మోడీ

13. నాగార్జునసాగర్‌లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నాము.

- కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

14. హైదరాబాద్ మెట్రోకు మోడీ హామీ మేరకు రూ.16,000 కోట్లు మంజూరు చేస్తాం.

- కేంద్ర హోం మంత్రి అమిత్ షా

15. వెనుకబడిన సిద్దిపేట జిల్లాకు కేంద్ర ప్రభుత్వం తరపున ప్రధాని మోడీ మెడికల్ కాలేజీ మంజూరు చేస్తారు.

- దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

16. ప్రతీ నియోజకవర్గంలో బీజేపీ ప్రభుత్వం 1 లక్ష ఇండ్లు కట్టిస్తుంది.

- నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

17. హుజూర్‌నగర్ నియోజకవర్గాన్ని రూ.1000 కోట్లతో అభివృద్ధి చేస్తాం

- హుజూర్‌నగర్ బీజేపీ అభ్యర్థి కోట రామారావు

18. కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసం రక్షణ శాఖ నుంచి రూ.700 కోట్ల నిధులు తీసుకొని వస్తాం.

- కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్

19. బీడీ కార్మికులకు సంక్రాంతి నుంచి మోడీ ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది.

- దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

20. ఆదిలాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం కొత్త విమానాశ్రయం మంజూరు చేస్తుంది.

- ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు

21. అధికారంలోకి రాగానే.. కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తాం

- ప్రధాని నరేంద్ర మోడీ

22. తెలంగాణలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తాం. మిషన్ కాకతీయకు అవసరమైన సహకారం అందిస్తాం.

- మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి

23. విదేశాల నుంచి నల్లధనం తీసుకొని రావడానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం.ట్యాక్సులు కట్టే వారికి ఆ మనీని తిరిగి బహుమతిగా ఇస్తాం.

- ప్రధాని నరేంద్ర మోడీ

24. మిషన్ భగీరథను మరింతగా అభివృద్ధి చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నది.

- కేంద్ర మంత్రి రామ్ క్రిపాల్ యాదవ్

25. రాష్ట్రంలోని ప్రతీ మండలంలో ఉమెన్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. అందరికీ ఉద్యోగాలు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది.

- కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

26. మోడీకి మరో సారి ఓటేస్తే.. తెలంగాణలోని షుగర్ ఫ్యాక్టరీలు అన్నీ తిరిగి తెరిపిస్తాం.

- నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

27. కల్వకుర్తి నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రతీ ఒక్కరికి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ద్వారా ఉచితంగా సొంత ఇండ్లు నిర్మించి ఇస్తాం.

- హోం మంత్రి అమిత్ షా

28. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం.

- ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

29. తెలంగాణకు నాలుగు ఫుడ్ పార్కులు మంజూరు చేస్తాం. రాష్ట్రంలోని రైతులకు ఇవి ఉపయోగపడతాయి.

- అప్పటి కేంద్ర మంత్రి నిరంజన్ జ్యోతి

30. గోదావరి నది సమీపంలో కేంద్రమే డ్రై పోర్ట్ నిర్మిస్తుంది.

- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

31. ప్రతీ ఇంటికి 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తాం.

- ప్రధాని నరేంద్ర మోడీ

32. వరంగల్‌లో పత్తి పరిశోధనా కేంద్రాన్ని త్వరితగతిన ప్రారంభిస్తాం.

- కేంద్ర మంత్రి సంతోశ్ గంగ్వార్

33. ప్రతీ దీపావళి, హోళీకి ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తాం.

- కేంద్ర హోం మంత్రి అమిత్ షా

34. హైదరాబాద్-నాగార్జునసాగర్ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తాం.

- కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

35. ప్రతీ రైతుకు నాగలి, రెండు ఎద్దులు ఉచతంగా పంపిణీ చేస్తాం.

- దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

36. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తాం. తెలంగాణకు ఇది చాలా అవసరం.

- బీజేపీ మాజీ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

37. తెలంగాణకు మరో ప్రాంతీయ విమానాశ్రయం ఉంటే.. పర్యాటకం, ఐటీ. వ్యాపారం పెరుగుతుంది. అది తప్పక అవసరం.

- కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

38. ప్రతీ రైతుకు ఉచిత బోర్ వెల్ మంజూరు చేయడమే కాకుండా.. అందుకు అయ్యే ప్రతీ ఖర్చును భరిస్తాము.

- బీజేపీ రాజ్యసభ ఎంపీ కే.లక్ష్మణ్

39. కల్వకుర్తి నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొని రావడమే కాకుండా.. మరిన్ని ఉద్యోగాలు తీసుకొని వస్తాము.

- కేంద్ర హోం మంత్రి అమిత్ షా

40. రైతుల రుణాలకు సంబంధించిన వడ్డీని బీజేపీ ప్రభుత్వమే కడుతుంది.

- రాజ్యసభ బీజేపీ ఎంపీ కే.లక్ష్మణ్

41. వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చే బాధ్యత బీజేపీదే

- రాజ్యసభ బీజేపీ ఎంపీ కే.లక్ష్మణ్

42. వరంగల్, హైదరాబాద్‌లో సైన్స్ సిటీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని వస్తాం.

- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

43. 2022 చివరి కల్లా ప్రతీ ఒక్కరికి సొంత ఇల్లు కట్టిస్తాం. అప్పటి వరకు ప్రతీ ఒక్కరి అద్దె బీజేపీనే భరిస్తుంది.

- ఆర్మూర్ బీజేపీ అభ్యర్థి వినయ్ కమార్ రెడ్డి

44. తెలంగాణకు ఐఐఎం కావాలని బీజేపీ తరపున అభ్యర్థించగా.. ప్రభుత్వం అంగీకరించింది.

- రాజ్యసభ బీజేపీ ఎంపీ కే.లక్ష్మణ్

45. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాకు నవోదయ విద్యాలయ కావాలని కోరగా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

- రాజ్యసభ బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్

46. ఆర్మూన్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ది చేయడమే కాకుండా.. ప్రతీ కుటుంబానికి తులం బంగారం బీజేపీ ఇస్తుంది.

- ఆర్మూర్ బీజేపీ అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డి

47. కేంద్రంలోని ప్రతీ శాఖతో మాట్లాడి ఏపీ పునర్విభజన చట్టం వల్ల ఏర్పడిన ప్రతీ సమస్యను పరిష్కరిస్తాము.

- బీజేపీ నాయకుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

48. పంటకు కనీస మద్దతు ధరతో పాటు అదనంగా బోనన్ కూడా మోడీ ప్రభుత్వం ఇస్తుంది.

- రాజ్యసభ బీజేపీ ఎంపీ కే.లక్ష్మణ్

49. రక్షణ శాఖకు చెందిన భూములను ప్రజాప్రయోజనార్థం ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది.

- బీజేపీ నాయకుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

50. మాదాసి కురువ సామాజిక వర్గాన్ని ఎస్సీల్లో తప్పకుండా చేర్చుతాము.

- రాజ్యసభ బీజేపీ ఎంపీ కే.లక్ష్మణ్

51. డిగ్రీ కాలేజీలో చేరే ప్రతీ ఆడపిల్లకు టూవీలర్ ఇస్తాము.

- హోం మంత్రి అమిత్ షా, భూపాలపల్లి బీజేపీ అభ్యర్థి కీర్తి రెడ్డి

52. పత్తికి కనీస మద్దతు ధరను రూ.5,200 నుంచి రూ.10,000కు ప్రధాని నరేంద్ర మోడీ పెంచుతారు.

- బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా

53. హైదరాబాద్‌లో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

- కేంద్ర హోం మంత్రి అమిత్ షా

54. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను బీజేపీ తప్పకుండా ఇస్తుంది.

- కేంద్ర హోం మంత్రి అమిత్ షా

55. మా ప్రభుత్వం ప్రతీ కిలో పారా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేస్తుంది.

- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ సా

56. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేంద్రమే చేపడుతుంది.

- కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి

57. గజ్వేల్‌కు సెంట్రల్ యూనివర్సిటీని మంజూరు చేస్తున్నాము.

- కేంద్ర హోం మంత్రి అమిత్ షా

58. హైదరాబాద్‌కు సైన్స్ సిటీని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

- కేంద్ర హోం మంత్రి అమిత్ షా

59. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన అమ్మాయిలకు రూ.25 వేల ఇన్సెంటీవ్‌ను అందజేస్తాము.

- బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

60. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పిస్తాము.

- కేంద్ర హోం మంత్రి అమిత్ షా

61. హైదరాబాద్ పాత నగరంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తాం.

- బీజేపీ నాయకుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

62. తెలంగాణలోని 31 జిల్లాల్లో కస్తూర్బా పాఠశాలలు కావాలని బీజేపీ రాష్ట్ర శ్రేణులు అడిగాయి. వాటిని వెంటనే మంజూరు చేస్తాము.

- రాజ్యసభ బీజేపీ ఎంపీ కే.లక్ష్మణ్

63. కుల గణన ద్వారా ఓబీసీ, ఎస్సీలకు ప్రధాని మోడీ తప్పకుండా న్యాయం చేస్తారు.

- బీజేపీ సంఘమిత్ర మౌర్య

64. ఒక కేంద్ర మంత్రిగా చేతి వృత్తుల వారికి, ఇతర నైపుణ్యం గల వారికి ఆర్థిక సాయం చేస్తానని భరోసా ఇస్తున్నాను.

- బీజేపీ నాయకుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

65. ఇల్లు లేని పేదలకు కొత్త ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తాం.

- సంగారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజేశ్వర్ రావు

66. కోరుట్లలో బీడీ కార్మికుల కోసం ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించమని కేంద్రాన్ని కోరాను. అందుకే అంగీకారం తెలిపింది.

- కోరుట్ల బీజేపీ అభ్యర్థి జేఎన్ వెంకట్

67. నారాయణ్‌పేట్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వమే ఒక ఫ్యాక్టరీని స్థాపించి, ఇక్కడి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది.

- నారాయణ్‌పేట్ బీజేపీ అభ్యర్థి రతంగ్ పాండు రెడ్డి

68. ప్రధాని మోడీ సహకారంతో సిద్దిపేటలో ఒక ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేసి.. ఇక్కడి నిరుద్యోగులకు 10వేల జాబ్స్ తీసుకొని వస్తాను.

- సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థి నరోత్తమ్ రెడ్డి

69. వరంగల్‌లో కేంద్ర ప్రభుత్వం తప్పకుండా 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మిస్తుంది.

- బీజేపీ నాయకుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

70. వరంగల్‌లో కేంద్ర ప్రభుత్వం ఒక ఐటీ హబ్‌ను ఏర్పాటు చేసి.. 10 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇస్తుంది.

- వరంగల్ బీజేపీ అభ్యర్థి ధర్మారావు

71. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పార్లమెంట్‌తో పాటు ప్రతీ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ అమలు చేస్తుంది.

- ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్

72. కేంద్ర ప్రభుత్వం ట్రైబల్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా.. ఆదివాసీలకు 9.8 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాము.

- బీజేపీ మాజీ ఎంపీ రవీందర్ నాయక్

73. మానకొండూరులో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రైవేట్ ఇండస్ట్రీని స్థాపించి, 2వేల మంది స్థానికులకు ఉద్యోగాలు ఇస్తుంది.

- మానకొండూరు బీజేపీ అభ్యర్థి గడ్డం నాగరాజు

74. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గితే.. కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తుంది.

- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

75. తెలంగాణలోని ప్రతీ గ్రామీణ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఎంప్లాయిమెంట్ సెంటర్ ప్రారంభిస్తుంది. దీంతో పాటు స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఉద్యోగ కల్పన చేస్తుంది అంతే కాకుండా బ్యాంకు లోన్లుకూడా అందిస్తుంది.

- నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ఆనంద్ రెడ్డి

76. ప్రతీ వారం ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం, ప్రతీ మూడ రోజులకు ఒక అటల్ ల్యాబ్, ప్రతీ రెండు రోజులకు ఒక సెంట్రల్ కాలేజీ, ప్రతీ రోజు ఒక ఐటీఐ, ప్రతీ ఏడాది ఒక ఐఐఎంలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనున్నది.

- ప్రధాని నరేంద్ర మోడీ

77. పర్యాటక శాఖ మంత్రి సహాయంతో రాచకొండను ఒక టూరిజం హబ్ లాగా మార్చబోతున్నాము.

- బీజేపీ నాయకుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

78. వరంగల్‌లో కేంద్ర ప్రభుత్వమే ఎయిర్ పోర్టును నిర్మిస్తుంది.

- కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

79. రాబోయే ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష డిజిటల్ గ్రామాలను తయారు చేయబోతోంది.

- మినిస్టర్ ఆఫ్ కామర్స్ పీయుష్ గోయల్

80. హైదరాబాద్‌లోని ఒక లక్ష ఇళ్లకు పైపు ద్వారా గ్యాస్ సరఫరా చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.

- కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

81. గోల్కొండ, చార్మినార్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది.

- కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

82. దుబ్బాకకు కేంద్రం ప్రత్యేక నిధులను విడుదల చేసి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తుంది.

- దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

83. గొల్ల కురుమలను ఎస్సీల్లో కలుపుతాం.

- బీజేపీ నాయకుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

84. జీఎస్టీకి ముందు ప్రతీ ఒక్క వస్తువు ఎక్కువ ధర ఉండేది. జీఎస్టీ తర్వాత వస్తువుల ధరలు తగ్గాయి.

- ప్రధాని నరేంద్ర మోడీ

85. చేనేతపై వేసిన జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తుంది.

- బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

86. కేంద్ర సాంస్కతిక శాఖ మంత్రిగా.. బోనాలు పండుగను జాతీయ పండుగగా గుర్తించేలా చర్యలు తీసుకుంటాను.

- కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

87. రోడ్లకు ధీటుగా జల మార్గాలను కూడా అభివృద్ధి చేస్తాము. ఇందులో భాగంగా గోదారి నదిలో జల రవాణాకు అనుకూలంగా మార్గాలను అభివృద్ధి చేస్తాం.

- కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి

88. డిచ్‌పల్లి కేంద్రంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసి.. ఉద్యోగాలు ఇస్తుంది.

- బీజేపీ నాయకుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

89. ఆర్మూరులో కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మిస్తుంది.

- బీజేపీ నాయకుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

90. ప్రధాన్ మంత్రి స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా రాష్ట్రంలో మరిన్ని సెంటర్లను తీసుకొని వచ్చి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం.

- నాగార్జునసాగర్ బీజేపీ అభ్యర్థి నివేదిత

91. రైతు కూలీలకు కేంద్ర ప్రభుత్వమే శిక్షణ ఇస్తుంది. అంతే కాకుండా 1 కోటి మందికి ఉపాధి కూడా కల్పిస్తుంది.

- హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

92. కేజీ నుంచి పీజీ వరకు బీజేపీ ప్రభుత్వం ఉచితంగా విద్యను అందిస్తుంది.ౌ

- కేంద్ర హోం మంత్రి అమిత్ షా

93. దుబ్బాకలో బీజేపీ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం పెన్షన్‌ను రూ.1000 నుంచి రూ.3000కు పెంచుతుంది.

- బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

94. రైతు కూలీలందరికీ రూ.3వేల పెన్షన్‌ను బీజేపీ అందిస్తుంది.

- భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కీర్తి రెడ్డి

95. సంగారెడ్డిని మేజర్ ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చడమే కాకుండా.. 25 వేల నుంచి 30 వేల కొత్త ఉద్యోగాలను ఇస్తాము.

- సంగారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజేశ్వర్ రావు

96. ఉర్ధూ భాష వ్యాప్తి, రిజర్వేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం తప్పకుండా పనిచేస్తుంది.

- బీజేపీ నాయకుడు మురళీ మనోహర్ జోషి

97. దేశంలోని ప్రతీ గ్రామానికి బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తాము.

- ప్రధాని నరేంద్ర మోడీ

98. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే రైతుల రుణాలపు పూర్తిగా మాఫీ చేస్తాము.

- ప్రధాని నరేంద్ర మోడీ

99. కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తున్న హై స్పీడ్ ట్రెయిన్ డైమండ్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ వల్ల దేశంలో సరికొత్త రైల్వే వ్యవస్థ ఏర్పడుతుంది. అంతే కాకుండా భారత దేశ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది.

- ప్రధాని నరేంద్ర మోడీ

100. దేశంలో అవినీతిని నిర్మూలించడమే కాకుండా.. ఎవరూ లంచాలు తీసుకోకుండా బీజేపీ ప్రభుత్వం చూస్తుంది.

- ప్రధాని నరేంద్ర మోడీ

First Published:  15 Aug 2023 12:00 AM GMT
Next Story