Telugu Global
Telangana

JEE అడ్వాన్స్ లో ప్రతిభ చాటిన బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ విద్యార్ధులు

బెల్లంపల్లిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్‌ ఎక్సలెన్స్ (TSWR CoE) కు చెందిన ఏడుగురు విద్యార్ధులు జేఈఈ అడ్వాన్స్ లో క్వాలిఫై అయ్యారు

JEE అడ్వాన్స్ లో ప్రతిభ చాటిన బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ విద్యార్ధులు
X

బెల్లంపల్లిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్‌ ఎక్సలెన్స్ (TSWR CoE) కు చెందిన ఏడుగురు విద్యార్ధులు జేఈఈ అడ్వాన్స్ లో క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయిన ఏడుగురు విద్యార్ధుల్లో ఎనగందుల మౌర్య 957 ర్యాంక్ సాధించి అందరిలో కెల్లా మొదటి స్థానంలో నిలిచింది. క్వాలిఫై అయిన వారిలో మౌర్యతో పాటు సిలివేరు వినయ్, ముంజం అంజన్న, సోనాకాంబ్లే లక్ష్మణ్ సిద్దు, బత్తుల కార్తీక్, అలకటి గణేష్, గట్టు శ్రీహర్షలున్నారు. క్వాలిఫై అయిన వారిని సోషల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ రీజినల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ కొప్పుల స్వరూప రాణి అభినందించారు.

ఇటీవల ప్రకటించిన నీట్ పరీక్షా ఫలితాల్లో కూడా ఇదే కాలేజీ నుంచి 12 మంది క్వాలిఫై అయ్యారు. వారిలో ఏడుగురు నేషనల్ లెవెల్ ర్యాంకులు సాధించారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్టీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్ధుల కోసం ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేసింది. నాణ్యమైన విద్యతో పాటు ఆహారాన్ని అందిస్తుంది. దీంతో పేద విద్యార్ధులు చదువులో దూసుకుపోతున్నారు. JEE, NEET వంటి పరీక్షల్లో క్వాలిఫై అయి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన IIT,NIT లలో అడ్మిషన్లు పొందుతున్నారు. పేద విద్యార్ధుల జీవితాల్లో సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాలు వెలుగులు నింపుతున్నాయి.

First Published:  18 Jun 2023 3:42 PM GMT
Next Story