Telugu Global
Telangana

బీ కేర్ ఫుల్..కాబోయే సీఎంని నేను.. మునుగోడులో పాల్ కామెడీ

ఆ వాహనాల వెనకే వస్తున్న కేఏ పాల్ ను అధికారులు అడ్డుకున్నారు. దీంతో వారిపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ నా ఫాలోవర్ అంటూ.. వారిపై మండిపడ్డాడు.

బీ కేర్ ఫుల్..కాబోయే సీఎంని నేను.. మునుగోడులో పాల్ కామెడీ
X

ఎక్కడైనా ఎన్నికలు జరుగుతుంటే గొడవలు, కొట్లాటలు జరగడం మామూలే. ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఫలితాలు వచ్చేదాకా వ్యవహారం కాస్త సీరియస్ గానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఆ గొడవలు కొట్లాటలతో పాటు కామెడీ కూడా ఉంటుంది. ఎందుకంటే కేఏ పాల్ రాజకీయాల్లోకి రావడమే అందుకు కారణం. ఏపీలో జరిగిన గత ఎన్నికల సమయంలో కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ తరపున చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబట్టి పోటీ చేయించాడు.

రాష్ట్రమంతా తిరిగి భలే కామెడీ చేసాడు. అంత సీరియస్ వాతావరణంలోనూ తన కామెడీతో ప్రజలను నవ్వించాడు. అయితే ఇప్పుడు కేఏ పాల్ తెలంగాణపై పడ్డాడు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఆ నియోజకవర్గాన్ని మొత్తాన్ని చుట్టేస్తున్నాడు. మునుగోడును అమెరికాలా తయారుచేస్తా..అంటూ ప్రజలకు హామీ ఇస్తున్నాడు. అమలు చేయడానికి సాధ్యం కానన్ని హామీలు ఇస్తూ నవ్వులు పూయిస్తున్నాడు.

ఇదిలా ఉండగా చండూరులో కేఏ పాల్‌కు చెందిన రెండు ప్రచార వాహనాలు ప్రచారం నిర్వహిస్తుండగా ఆ వాహనాల వెనకే వస్తున్న కేఏ పాల్ ను అధికారులు అడ్డుకున్నారు. దీంతో వారిపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ నా ఫాలోవర్ అంటూ.. వారిపై మండిపడ్డాడు. బీ కేర్ ఫుల్.. నేను తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిని.. కొంత రెస్పెక్ట్ ఇవ్వండి..అంటూ వారిపై చిందులేశాడు.

పాల్ ను అడ్డుకున్న అధికారుల్లో ఒక అధికారి పేరును అడగ్గా.. అతడు చెప్పకపోవడంతో మెడలోని ఐడీ కార్డు లాక్కునే ప్రయత్నం చేశాడు. చివరికి ఇతర అధికారులు కేఏ పాల్ కు సర్ది చెప్పి అక్కడ నుంచి పంపించారు. మునుగోడులో ఎలాగైనా గెలవాలని ఒకవైపు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాత్రం తన చేష్టలతో ప్రజలకు న‌వ్వులు పంచుతున్నాడు.

First Published:  23 Oct 2022 5:05 AM GMT
Next Story