Telugu Global
Telangana

కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్.. కీలక అంశాలు ఇవే

ఈ ఎన్నికల్లో బీసీలు అడిగినన్ని సీట్లు ఇవ్వలేక పోయినా.. ఈ డిక్లరేషన్ తో బీసీలను బుజ్జగించాలని చూస్తోంది కాంగ్రెస్.

కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్.. కీలక అంశాలు ఇవే
X

నిన్న మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు బీసీ డిక్లరేషన్ విడుదల చేసింది. కామారెడ్డి బహిరంగ సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు నేతలు. ఈ సభకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్, వీహెచ్, పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



డిక్లరేషన్ లోని ముఖ్యాంశాలు..

- స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు 22 నుంచి 42 శాతానికి పెంపు.

- ప్రతి మండలంలో బీసీలకు ప్రత్యేక గురుకులాలు.

- జిల్లా కేంద్రాల్లో బీసీలకు ప్రత్యేక భవనాల నిర్మాణం.

- ఐదేళ్లలో బీసీల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు.

- 50ఏళ్లు దాటిన పద్మశాలీయులకు పెన్షన్ సౌకర్యం.

- మహాత్మ జ్యోతిబా పూలే సబ్ ప్లాన్ కింద ప్రతి ఏటా రూ.20వేల కోట్లు.

- విశ్వకర్మలు, మున్నూరు కాపుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు.

- గద్వాల్, సిరిసిల్ల, నారాయణ్ ఖేడ్ లో పవర్ లూమ్స్ ఏర్పాటు

- రజకుల కోసం రూ.10 లక్షల సబ్సిడీ రుణాలు.

- వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు.

- వెనుకబడిన వర్గాల పిల్లల విద్యావసరాల కోసం రూ.10 లక్షల రుణ సాయం.

- జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ పెంపు

- వైన్స్ షాపుల టెండర్లలో గౌడ్స్ రిజర్వేషన్ మరింత పెంపు

ఇటీవల తెలంగాణలో బీజేపీ బీసీ గర్జన సభ జరిగింది. ఆ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ కూడా బీసీ ఓట్లకు గేలం సిద్ధం చేసింది. డిక్లరేషన్ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో బీసీలు అడిగినన్ని సీట్లు ఇవ్వలేక పోయినా.. ఈ డిక్లరేషన్ తో బీసీలను బుజ్జగించాలని చూస్తోంది కాంగ్రెస్.

First Published:  10 Nov 2023 11:17 AM GMT
Next Story