Telugu Global
Telangana

రేపటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ.. ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే..?

ఇప్పటికే 80 శాతం చీరలు జిల్లా కేంద్రాల నుంచి గ్రామాలకు చేరుకున్నాయి. రేపటి నుంచి పంపిణీ మొదలు కాబోతోంది.

రేపటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ.. ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే..?
X

తెలంగాణలో బతుకమ్మ పండగ సందర్భంగా ఆడబిడ్డలకు చీరల పంపిణీకి రంగం సిద్ధమైంది. కోటి చీరలకు పైగా ఈ ఏడాది తెలంగాణ ఆడపడుచులకు పంపిణీ చేయబోతున్నారు. ఇప్పటికే 80శాతం చీరలు జిల్లా కేంద్రాల నుంచి గ్రామాలకు చేరుకున్నాయి. రేపటి నుంచి పంపిణీ మొదలు కాబోతోంది. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు ఈ చీరలు పంపిణీ చేస్తారు. తెలంగాణ జౌళి శాఖ, టెస్కో సంయుక్తంగా చీరల పంపిణీ చేపడుతున్నాయి.

ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే..?

ఈ ఏడాది మొత్తం పంపిణీ చేయాల్సిన చీరలు 1.02 కోట్లు..

ఆరు మీటర్ల పొడవున్న సాధారణ చీరలతోపాటు వృద్ధులకు 9 మీటర్ల చీరలు

10 రంగులతో 250 డిజైన్లలో చీరలు

సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల నేత కార్మికులచే తయారీ

2017నుంచి తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. గతేడాది వరకు మొత్తంగా 5.81 కోట్ల చీరలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ ఏడాది 1.02కోట్ల చీరలను పంపిణీకి సిద్ధం చేయిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల ద్వారా వీటిని పంపిణీ చేస్తారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.


First Published:  3 Oct 2023 5:49 AM GMT
Next Story