Telugu Global
Telangana

పేపర్ లీకుల వెనక బండిసంజయ్ కుట్ర..హరీష్ రావు ఆరోపణ

తాండూరు, వరంగల్ లో పదవ తరగతి ప్రశ్నా పత్రాలు లీక్ చేసిన వారు బీజేపీ కార్యకర్తలని హరీష్ రావు ఆరోపించారు. ఈ రెండు సంఘటనల్లో బండి సంజయ్ కుట్ర దాగుందని ఆయన అన్నారు.

పేపర్ లీకుల వెనక బండిసంజయ్ కుట్ర..హరీష్ రావు ఆరోపణ
X

వరసగా రెండురోజులు పదవ తరగతి ప్రశ్నపత్రాల లీక్ వెనక పెద్ద కుట్ర జరిగిందని తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయడం కోసం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు. తమ స్వార్ద రాజకీయాల కోసం బీజేపీ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆదుతున్నదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన మీడియా తో మాట్లాడుతూ, బీజేపీలో అందరూ ఫేక్ సర్టిఫికెట్ల‌ నేతలే అని, వారికి చదువు విలువ ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు.

తాండూరు, వరంగల్ లో పదవ తరగతి ప్రశ్నా పత్రాలు లీక్ చేసిన వారు బీజేపీ కార్యకర్తలని హరీష్ రావు ఆరోపించారు. ఈ రెండు సంఘటనల్లో బండి సంజయ్ కుట్ర దాగుందని ఆయన అన్నారు. తాండూరులో తెలుగు ప్రశ్నా పత్రాన్ని లీక్ చేసింది బీజేపీ ఉపాధ్యాయ సంఘం నేత అని, వరంగల్ లో హిందీ పేపర్ లీక్ చేసింది ప్రశాంత్ కరుడుగట్టిన బీజేపీ కార్యకర్త, బండి సంజయ్ అనుంగు అనుచరుడు అని చెప్పారు. బీజేపీ నేతలతో ప్రశాంత్ దిగిన ఫొటోలను, పోస్టర్లను మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా మీడియా ముందు ప్రదర్శించారు.

పదవ తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయనే వార్తలతో ఆందోళన చెందవద్దని విద్యార్థులకు, తల్లిదండ్రులకు మంత్రి హరీశ్ రావు సూచించారు.

First Published:  5 April 2023 8:18 AM GMT
Next Story