Telugu Global
Telangana

మరో విద్యార్థిని కొట్టిన బండి సంజయ్ కుమారుడు...మరో వీడియో బహిర్గతం

సోషల్ మీడియాలో మరో వీడియో బహిర్గతమైంది. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్, అతని స్నేహితులు ఓ రూం లో మరో విద్యార్థిని ఇష్టమొచ్చినట్టు కొడుతున్న దృశ్యాలతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరో విద్యార్థిని కొట్టిన బండి సంజయ్ కుమారుడు...మరో వీడియో బహిర్గతం
X

హైదరాబాద్ లోని మహేంద్ర యూనివర్సిటీలో చదువుతున్న బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కాలేజీలో ఓ విద్యార్థిపై చేసిన దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో 'బండి' పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయినప్పటికీ సంజయ్ తన కుమారుడిని వెనకేసుకొచ్చి చిన్నపిల్లలను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతారంటూ మండి పడుతున్నాడు. మరో వైపు బాధిత విద్యార్థి ఓ అమ్మాయిని వేదించినందుకే తన కుమారుడు అతన్ని కొట్టాడని సమర్దించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఒక వైపు ఈ వీడియోపై గొడవ సాగుతుండగానే సోషల్ మీడియాలో మరో వీడియో బహిర్గతమైంది. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్, అతని స్నేహితులు ఓ రూం లో మరో విద్యార్థిని ఇష్టమొచ్చినట్టు కొడుతున్న దృశ్యాలతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోపై ఇప్పటి వరకు బండి సంజయ్ కానీ, భగీరథ్ కానీ స్పందించలేదు. అయితే నెటిజనులు మాత్రం వారిద్దరిపై విరుచుకపడుతున్నారు. భగీరత్ కాలేజీలో ఇంత అరాచకం సృష్టిస్తూ ఉంటే యూనివర్సిటీ యాజమాన్యం ఏం చేస్తోందంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.

ఈ వీడియో ఎప్పటిది ? బండి భగీరథ్, అతని స్నేహితుల చేతుల్లో దెబ్బలు తింటున్న ఆ విద్యార్థి ఎవరు ? అనే విషయాలు తెలియాల్సి ఉంది.


First Published:  18 Jan 2023 5:53 AM GMT
Next Story