Telugu Global
Telangana

మీరు సీఎం.. సీఎం..అన్నందుకే.. నా పోస్ట్ పోయింది.. బండి సంజయ్ వ్యాఖ్యలు వైరల్

బండి సంజయ్ ప్రసంగిస్తున్న సమయంలో పార్టీ కార్యకర్తలు సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలపై బండి సంజయ్ ఫన్నీగా స్పందించారు.

మీరు సీఎం.. సీఎం..అన్నందుకే.. నా పోస్ట్ పోయింది.. బండి సంజయ్ వ్యాఖ్యలు వైరల్
X

``సీఎం..సీఎం.. అంటూ మీరు చేసిన నినాదాలతోనే నా పోస్ట్ పోయింది`` అని కార్యకర్తలను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సాయంత్రం మంచిర్యాల జిల్లా జన్నారంలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.

బండి సంజయ్ ప్రసంగిస్తున్న సమయంలో పార్టీ కార్యకర్తలు సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలపై బండి సంజయ్ ఫన్నీగా స్పందించారు. మీరు ఇలా సీఎం.. సీఎం.. అని నినాదాలు చేయడం వల్లే నాకున్న పోస్ట్ కూడా ఊడిపోయింది అంటూ వ్యాఖ్యానించారు. బండి సంజయ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కాగా, కొద్ది రోజులు కిందటి వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ప‌నిచేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బండి రాజకీయంగా ఎంతో దూకుడు ప్రదర్శించారని పేరు తెచ్చుకున్నారు. ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఉప ఎన్నికల్లోనూ బీజేపీ విజయాలు అందుకుంది. ఇటీవ‌ల‌ బీజేపీ అధిష్టానం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ని తొలగించి ఆ స్థానంలో కిషన్ రెడ్డిని నియమించింది. ప్రస్తుతం కిషన్ రెడ్డి నేతృత్వంలోనే బీజేపీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోంది.

First Published:  9 Nov 2023 3:08 PM GMT
Next Story