Telugu Global
Telangana

కవిత బెయిల్‌పై బండి రియాక్షన్‌.. కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్‌

నా విజ్ఞప్తి ఏంటంటే.. బండి సంజయ్ వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణ పరిగణించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.

కవిత బెయిల్‌పై బండి రియాక్షన్‌.. కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్‌
X

బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో పొలిటికల్ డైలాగ్స్ పేలుతున్నాయి. కాంగ్రెస్‌ వల్లే బెయిల్ వచ్చిందని బీజేపీ ఆరోపిస్తుండగా.. బీజేపీ మద్దతుతోనే కవితకు బెయిల్ మంజూరు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన ట్వీట్ వివాదానికి దారి తీసింది.


బండి సంజయ్ ట్వీట్‌ ఏంటంటే!

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ సాధించినందుకు కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ లాయర్లకు శుభాకాంక్షలు. మీ అలుపెరుగని ప్రయత్నాలు చివరకు ఫలించాయి. కవిత బెయిల్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల సమష్టి విజయం. బెయిల్‌ మీద బీఆర్ఎస్ నేత బయటకు వస్తుంటే.. కాంగ్రెస్‌ వ్యక్తి తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్తున్నారు. గతంలో కవిత బెయిల్‌ కోసం వాదించిన వ్యక్తి, తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభకు నామినేట్ చేసిన వ్యక్తి (అభిషేక్ మను సింఘ్వి)కి కేసీఆర్ మద్దతు తెలుపుతున్నారు. ఇక బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఘాటుగా ట్వీట్ చేశారు.


కేటీఆర్ ట్వీట్ ఇదే..

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సహాయమంత్రిగా ఉన్న మీరు.. సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేస్తున్నారు. ఇది మీ హోదాకు ఏ మాత్రం సరికాదు. గౌరవనీయులైన సీజేఐ, సుప్రీంకోర్టుకు నా విజ్ఞప్తి ఏంటంటే.. బండి సంజయ్ వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణ పరిగణించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.

First Published:  27 Aug 2024 10:35 AM GMT
Next Story