Telugu Global
Telangana

బ‍ండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్- కరీంనగర్ సబ్ జైలుకు తరలింపు

హన్మకొండ జిల్లా కమలాపూర్ లో ఓ పాఠశాల నుండి నుండి పదవతరగతి ప్రశ్నా పత్రం లీక్ చేసిన కేసులో పోలీసులు బండి సంజయ్ ని A1 గా నమోదు చేశారు. A2గా మాజీ జర్నలిస్టు ప్రశాంత్, A3 గా కాకతీయ మెడికల్ కాలేజ్ లో ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న గుండబోయిన మహేష్, A4 గా మైనర్ బాలుడు, శివగణేష్ A5, పోగు సుభాష్ A6,పోగు శశాంక్ A7, దూలం శ్రీకాంత్ A8,పెరుమాండ్ల శ్రామిక్ A9, పోతబోయిన వర్షిత్ A10 గా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.

X

పేపర్ లీకేజీ కేసులో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి కోర్టు రెండు వారాల రిమాండ్ విధించింది. పోలీసులు బండి సంజ ని హన్మకొండలోని జడ్జి ఇంట్లో న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు. దాదాపు రెండు గంటలపాటు ఇరువర్గాల వాదనలు సాగిన తవాత మెజిస్ట్రేట్ సంజయ్ కి 14 రోజుల రిమాండ్ విధించింది.

హన్మకొండ జిల్లా కమలాపూర్ లో ఓ పాఠశాల నుండి నుండి పదవతరగతి ప్రశ్నా పత్రం లీక్ చేసిన కేసులో పోలీసులు బండి సంజయ్ ని A1 గా నమోదు చేశారు. A2గా మాజీ జర్నలిస్టు ప్రశాంత్, A3 గా కాకతీయ మెడికల్ కాలేజ్ లో ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న గుండబోయిన మహేష్, A4 గా మైనర్ బాలుడు, శివగణేష్ A5, పోగు సుభాష్ A6,పోగు శశాంక్ A7, దూలం శ్రీకాంత్ A8,పెరుమాండ్ల శ్రామిక్ A9, పోతబోయిన వర్షిత్ A10 గా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.

కాగా, సంజయ్ తో పాటు ఇతర నిందితులను కరీంనగర్ సబ్ జైలుకు తరలించారు.

First Published:  5 April 2023 3:02 PM GMT
Next Story