Telugu Global
Telangana

అయ్యయ్యో..! మోదీని విమర్శిస్తారా..? బండి ఆవేదన

కేసీఆర్ అలా కామెంట్ చేశారో లేదో, ఇలా బండి సంజయ్ తెరపైకి వచ్చారు. అయ్యయ్యో మా ప్రధానిని, మా మోదీని విమర్శిస్తారా అంటూ ఆయన భగ్గుమన్నారు.

అయ్యయ్యో..! మోదీని విమర్శిస్తారా..? బండి ఆవేదన
X

అత్యంత అసమర్థుడైన ప్రధాని నరేంద్ర మోదీ అంటూ తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ నేతలకు బాగానే మండినట్టుంది. కేసీఆర్ అలా కామెంట్ చేశారో లేదో, ఇలా బండి సంజయ్ తెరపైకి వచ్చారు. అయ్యయ్యో మా ప్రధానిని, మా మోదీని విమర్శిస్తారా అంటూ ఆయన భగ్గుమన్నారు. సభలో లేని ప్రధానిపై ఆరోపణలు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. అభివృద్ది, హామీలపై మాట్లాడకుండా మోదీని తిట్టడానికే అసెంబ్లీని వేదికగా చేసుకుంటారా? అన్నారు బండి. ప్రధాని గౌరవాన్ని మంటకలుపుతుంటే స్పీకర్ ఏం చేస్తున్నారని కూడా ప్రశ్నించారు. మోదీని తిట్టినవారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

ఉన్నమాటంటే ఉలుకెందుకు..?

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఎందుకు మంజూరు చేయలేదు..?

బీజేపీ హయాంలో 20లక్షలమంది పౌరసత్వాన్ని వదులుకున్న మాట వాస్తవం కాదా..?

ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా తయారవడం నిజం కాదా..? తలసరి ఆదాయం తగ్గిపోడానికి కారణం ఎవరు..?

అంటూ మరోసారి బీఆర్ఎస్ నేతలు బండికి కౌంటర్ ఇస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటా వాస్తవమేనని, ఉన్నమాటంటే బండికి ఉలుకెందుకని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

చర్చకు వస్తారా..?

తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. పాతబస్తీలో ఏటా వెయ్యి కోట్ల కరెంట్ చౌర్యాన్ని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు బండి సంజయ్. సచివాలయ డోమ్ లను కూల్చివేస్తామని మరోసారి స్పష్టం చేసారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం, పేదలందరికీ ఇళ్లు, రైతులకు పంట పరిహారం చెల్లిస్తామంటూ హామీలు కూడా ఇచ్చారు బండి సంజయ్. అయితే కేంద్రంలోని బీజేపీ తాను అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఈ పథకాలు అమలు చేసిందని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. చర్చకు పిలిచి పారిపోవడం బండికి అలవాటేనంటూ ఎద్దేవా చేస్తున్నారు. సభలో లేని మోదీ గురించి కేసీఆర్ సత్యాలే మాట్లాడారని, కానీ మోదీ.. ఏకంగా పార్లమెంట్ లోనే అసత్యాలు మాట్లాడారని కౌంటర్ ఇస్తున్నారు. మొత్తమ్మీద అసెంబ్లీలో మోదీపై కేసీఆర్ పేల్చిన పంచ్ లు బీజేపీ నేతల్ని బాగానే డిస్ట్రబ్ చేశాయి.

Next Story