Telugu Global
Telangana

బండీ ఇటు రావొద్దు.. యాదాద్రిని అపవిత్రం చేయొద్దు

దమ్ముంటే ప్రధాని నరేంద్ర మోదీని యాదాద్రికి తీసుకొచ్చి ప్రమాణం చేయించాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ నేతలు. మహారాష్ట్ర, కర్నాటకలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేదని యాదాద్రీశుని పాదాల వద్ద మోదీ ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.

బండీ ఇటు రావొద్దు.. యాదాద్రిని అపవిత్రం చేయొద్దు
X

మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన తర్వాత బండి సంజయ్ కొత్త డ్రామాకి తెరతీశారు. యాదాద్రి వద్ద ప్రమాణం చేస్తానంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ కూడా ప్రమాణం చేయాలంటూ సవాల్ విసిరారు. సహజంగా బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అలాంటి సంజయ్ యాదాద్రిని ఎంపిక చేసుకున్నప్పుడే అక్కడ కుట్ర ఉన్నట్టు తేలిపోయింది. యాదాద్రిలో బలప్రదర్శన చేయడానికే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ పనేథ్యంలో బండి సంజయ్ అసలు యాదాద్రిలో అడుగు పెట్టేందుకు వీలు లేదంటూ మండిపడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. యాదాద్రిని బండి అపవిత్రం చేయొద్దంటూ వారు నిరసనకు దిగారు.

బండి సంజయ్‌ రాకకు వ్యతిరేకంగా యాదగిరిట్టలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తంచేశారు. బండి సంజయ్‌, రఘునందన్‌ రావు దిష్టి బొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. నల్లజెండాలతో ర్యాలీ చేపట్టారు. యాదగిరిగుట్ట ప్రధాన కూడలి వద్ద దిష్టిబొమ్మలను దగ్ధం చేసి గో బ్యాక్ బండి అంటూ నినాదాలు చేశారు. బండి సంజయ్‌ యాదాద్రి ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నారని ఆగ్రహం వక్యం చేశారు.

దొంగపనులు చేసి ప్రమాణాలా..?

స్వాములతో దొంగ పనులు చేయించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపీ నాయకులు ఏ మొహం పెట్టుకుని యాదాద్రికి వస్తారంటూ ప్రశ్నిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. దేవస్థానానికి వచ్చి ప్రమాణం చేస్తామనడం సిగ్గు చేటన్నారు. దమ్ముంటే ప్రధాని నరేంద్ర మోదీని యాదాద్రికి తీసుకొచ్చి ప్రమాణం చేయించాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర, కర్నాటకలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేదని యాదాద్రీశుని పాదాల వద్ద మోదీ ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.

First Published:  28 Oct 2022 8:00 AM GMT
Next Story