Telugu Global
Telangana

బండి సంజయ్ కు బెయిల్ మంజూరు... రేపు జైలు నుండి విడుదల‌

ఫస్ట్ క్లాస్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనితా రాపోలు బెయిల్‌పై నిర్ణయాన్ని మొత్తం మూడుసార్లు వాయిదా వేశారు. చివరకు ఉత్కంఠ పరిస్థితుల మధ్య బెయిల్ మంజూరు చేశారు. అయితే సాక్షులను ప్రభావితం చేయకుండా, సాక్ష్యాలను తారుమారు చేయకుండా ఉండాలని కోర్టు ఆదేశించింది.

బండి సంజయ్ కు బెయిల్ మంజూరు... రేపు జైలు నుండి విడుదల‌
X

8గంటల ఉత్కంటకు తెరపడింది. హన్మకొండ కోర్టు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి బెయిల్ మంజూరు చేసింది. పదవతరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఏ1 గా ఉన్న బండి సంజయ్ కు బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. అసలు లీకేజే జరగలేదని, 9.30 గంటల‌కు పరీక్ష ప్రారంభమైతే సంజయ్ కి ఆ ప్రశ్నా పత్రం 11.30 గంటల‌కు వచ్చిందని , అందువల్ల దాంట్లో బండి సంజయ్ పాత్ర ఉందనడం అబద్దమని బండి తరఫు న్యాయవాది విద్యాసాగర్ రెడ్డి వాదించారు.

కాగా, కీలక విచారణ జరుగుతున్న దశలో బండికి బెయిల్ ఇస్తే విచారణ‌కు నష్టం కలుగుతుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. దాదాపు 8 గంటలపాటు ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి రాత్రి 10:20 గంటలకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఫస్ట్ క్లాస్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనితా రాపోలు బెయిల్‌పై నిర్ణయాన్ని మొత్తం మూడుసార్లు వాయిదా వేశారు. చివరకు ఉత్కంఠ పరిస్థితుల మధ్య బెయిల్ మంజూరు చేశారు. అయితే సాక్షులను ప్రభావితం చేయకుండా, సాక్ష్యాలను తారుమారు చేయకుండా ఉండాలని కోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని బండిని కోర్టు ఆదేశించింది. అంతేకాదు.. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళరాదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

First Published:  6 April 2023 5:48 PM GMT
Next Story