Telugu Global
Telangana

జూబ్లిహిల్స్‌ నాదే.. వారసత్వం అంటే కుదరదు

కాంగ్రెస్‌లో జూబ్లిహిల్స్‌ టికెట్‌పై వివాదం నడుస్తోంది. జూబ్లిహిల్స్ నుంచే పోటీ చేస్తానని అజారుద్దీన్‌ చెప్తుండగా.. పీజేఆర్ కుమారుడు విష్ణువర్దన్ రెడ్డి గతంలో ఓ సారి ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు.

జూబ్లిహిల్స్‌ నాదే.. వారసత్వం అంటే కుదరదు
X

జూబ్లిహిల్స్ నుంచే పోటీ చేస్తానని మరోసారి స్పష్టం చేశారు మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్‌ నేత అజారుద్దీన్‌. వారసత్వం ఉందని తమకే టికెట్‌ కావాలంటే కుదరదన్నారు. `నా నియోజకవర్గంలో నేనే ఉంటా` అనడం సరికాదన్నారు. సర్వేల ఆధారంగా ఎవరు బలంగా ఉంటే వారికే టికెట్ ఇస్తారని చెప్పుకొచ్చారు అజారుద్దీన్‌. పరోక్షంగా పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్దన్ రెడ్డిని ఉద్దేశించి అజారుద్దీన్ ఈ కామెంట్స్ చేశారు. ఒక్కరితోనే గెలుపు సాధ్యం కాదని.. అందరి మద్దతు ఉంటేనే పార్టీ విజయం సాధిస్తుందన్నారు.

ఇక కాంగ్రెస్‌లో జూబ్లిహిల్స్‌ టికెట్‌పై వివాదం నడుస్తోంది. జూబ్లిహిల్స్ నుంచే పోటీ చేస్తానని అజారుద్దీన్‌ చెప్తుండగా.. పీజేఆర్ కుమారుడు విష్ణువర్దన్ రెడ్డి గతంలో ఓ సారి ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు. ఈసారి కూడా తనకే టికెట్ వస్తుందని ధీమాతో ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో ప‌ర్య‌టిస్తున్న అజారుద్దీన్‌ రెండు రోజుల క్రితం విష్ణువర్ధన్‌ రెడ్డి ప్రత్యర్థి వర్గంతో సమావేశమయ్యారు. నియోజకవర్గ నేతలు, స్థానిక క్యాడర్‌తో టచ్‌లో ఉంటూ వస్తున్నారు. పలు కార్యక్రమాలు సైతం నిర్వహించారు.

ఈసారి ఎలాగైనా జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో జెండా ఎగరేయాలని కాంగ్రెస్ అధిష్టానం పట్టుదలతో ఉంది. జూబ్లిహిల్స్‌ నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల ఓటర్లు ఉంటే అందులో 40 శాతం మైనార్టీల ఓట్లు ఉన్నాయి. ఈ కారణంతోనే అజారుద్దీన్‌ను జూబ్లిహిల్స్‌ బరిలో దించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

First Published:  4 Sep 2023 10:58 AM GMT
Next Story