Telugu Global
Telangana

ఆయుర్వేద ఆల్కహాల్‌ వచ్చేసింది.. మందుబాబులకు హెల్తీ కిక్కు

ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి బయో లిక్కర్ అన్నారు డాక్టర్ శ్రీనివాస్ అమర్‌నాథ్. ఎలాంటి సింథటిక్‌ రుచులు, రంగులను ఉపయోగించకుండా ఆయుర్వేద పద్ధతిలో ఈ బయో లిక్కర్ తయారు చేసినట్లు చెప్పారు.

ఆయుర్వేద ఆల్కహాల్‌ వచ్చేసింది.. మందుబాబులకు హెల్తీ కిక్కు
X

మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కానీ, ఇప్పుడు చెప్పబోయే వార్త మాత్రం మందుబాబులకు ఆరోగ్యకరమే. అవును హైదరాబాద్‌ మార్కెట్లోకి ఆయుర్వేద ఆల్కహాల్‌ ఎంట్రీ ఇచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఆరోగ్యానికి ఎటువంటి హానీ చేయని బయో లిక్కర్ అందుబాటులోకి వచ్చింది.

అన్ని అనుమతులతో బుధవారం ఈ లిక్కర్‌ను విడుదల చేశారు సంస్థ నిర్వాహకులు. ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ బీ.శ్రీనివాస అమర్‌నాథ్‌ ఈ లిక్కర్‌ను సృష్టించారు. మద్యపానం చేసేవారి అవయవాలపై ఎలాంటి చెడు ప్రభావం పడకూడదన్న లక్ష్యంతోనే ఈ బయో లిక్కర్‌ను తయారు చేసినట్లు స్పష్టం చేశారు.

ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి బయో లిక్కర్ అన్నారు డాక్టర్ శ్రీనివాస్ అమర్‌నాథ్. ఎలాంటి సింథటిక్‌ రుచులు, రంగులను ఉపయోగించకుండా ఆయుర్వేద పద్ధతిలో ఈ బయో లిక్కర్ తయారు చేసినట్లు చెప్పారు. తులసీ, అల్లం, పసుపు, లవంగ, యాలకులు, కలబంద వంటి ఆయుర్వేద పదార్థాలను కలిపి ఈ లిక్కర్​ తయారు చేశామన్నారు.

దీనికి US FDA అనుమతి సైతం లభించినట్లు వివరించారు. బయో విస్కీ, బయో బ్రాందీ, వైల్డ్ పాక్స్ విస్కీని తెలంగాణలో విక్రయించనున్నట్లు తెలిపారు. వీటి ధరలు ఎంత అనేది తెలియాల్సి ఉంది.

First Published:  4 April 2024 6:38 AM GMT
Next Story