Telugu Global
Telangana

తెలంగాణలో ఆరిజెన్ ఫార్మా పెట్టుబడులు..

ఆరిజెన్ ఫార్మా, జీనోమ్ వ్యాలీలో బయో మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పుతుంది. దాదాపు 328 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడ కొత్త యూనిట్ ప్రారంభిస్తారు. 250మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది.

తెలంగాణలో ఆరిజెన్ ఫార్మా పెట్టుబడులు..
X

ఫార్మా దిగ్గజ సంస్థ ఆరిజెన్ ఫార్మా తెలంగాణలో బయో మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకి ముందుకొచ్చింది. జీనోమ్ వ్యాలీలో ఈ యూనిట్ ఏర్పాటు చేయబోతోంది. ఈ సందర్భంగా ఆరిజెన్ ఫార్మా ప్రతినిధులను మంత్రి కేటీఆర్ అభినందించారు. శక్తిమంతమైన పర్యావరణ వ్యవస్థ ఉన్న జీనోమ్ వ్యాలీకి ఆరిజెన్ ఫార్మాను ఆయన స్వాగతించారు.


ఆరిజెన్ ఫార్మా, జీనోమ్ వ్యాలీలో బయో మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పుతుంది. దాదాపు 328 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడ కొత్త యూనిట్ ప్రారంభిస్తారు. 250మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఇక్కడ తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సంస్థ సిద్ధమైంది.

భారతదేశంలోని బయోలాజిక్స్ రంగంలో 30నుంచి 40శాతం పరిశోధనలు, తయారీకి హైదరాబాద్ కేంద్రంగా ఉంది. జీనోమ్ వ్యాలీలో ఫార్మా సంస్థలకు కేంద్రబిందువుగా మారింది. ఏడాదికేడాది అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ ని తమ ప్రాంతీయ కేంద్రంగా చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఫార్మా రంగంలో దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఆ లిస్ట్ లో తాజాగా ఆరిజెన్ ఫార్మా చేరడం విశేషం. బయోలాజిక్స్ లో హైదరాబాద్ మరింత పురోగతి సాధిస్తుందనడానికి ఇదే నిదర్శనం అని అన్నారు మంత్రి కేటీఆర్.

First Published:  4 July 2023 10:13 AM GMT
Next Story