Telugu Global
Telangana

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం: బీఎల్ సంతోష్ పై కేసు నమోదు

టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర వ్యవహారంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పై కేసు నమోదయ్యింది. ఆయనతో పాటు తుషార్, జగ్గుస్వామిలపై కూడా 'సిట్' కేసులు నమోదు చేసింది.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం: బీఎల్ సంతోష్ పై కేసు నమోదు
X

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ఎర వేశారనే కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ పై 'సిట్' అధికారులు కేసు నమోదు చేశారు. సంతోష్ తో పాటు తుషార్, జగ్గుస్వామిలపై కూడా కేసులు నమోదు చేశారు. సిట్ విచార‌ణ‌కు హాజ‌రు కావ‌ల్సిందిగా హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ స‌హ‌క‌రించాల్సిందిగా ఢిల్లీ పోలీసుల‌ను ఆదేశించింది

అయినా ఆయ‌న విచార‌ణ‌కు హాజ‌రు కాలేదు. అయితే సంతోష్ ఢిల్లీలో లేనందున ఆ నోటీసులు ఆయ‌న‌కు అంద‌లేద‌ని బిజెపి నేత‌లు చెప్పారు. మ‌రోసారి నోటీసులు జారీ చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 41ఏ సీఆర్పీసీ కింద ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చారు. తమ విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు రెండు తేదీలను నోటీసుల్లో సూచించారు. ఈ నెల 26న లేదా 28న విచారణకు రావాల్సిందిగా పేర్కొన్నారు. మరోవైపు సంతోష్ వాట్సాప్, ఈమెయిల్ కు కూడా నోటీసులు పంపారు.

మొయినాబాద్ ఫాం హౌస్ లో ఎమ్మెల్యేలతో బేర‌సారాలు జ‌రుపుతున్న త‌రుణంలో కొంద‌రు బిజెపి అగ్ర‌నేత‌ల పేర్ల‌ను మ‌ద్య‌వ‌ర్తులుగా వ‌చ్చిన ముగ్గ‌రు వ్య‌క్తులు ప్ర‌స్తావించారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రికి నోటీసులు ఇచ్చారు. బిజెపిలోకీల‌క నేత‌గా ఉన్న సంతోష్ కు కూడా నోటీసులు జారీ చేశారు.

Next Story