Telugu Global
Telangana

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య.. సరి-బేసి విధానంపై ఫోకస్‌..!

ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలో కారు పూలింగ్ విధానం అమల్లో ఉందని.. ఇక్కడ కూడా సరి - బేసి విధానం అమలు చేసే అంశంపైనా ఆలోచిస్తున్నామని సీపీ చెప్పారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య.. సరి-బేసి విధానంపై ఫోకస్‌..!
X

హైదరాబాద్‌ సిటీలో రోజురోజుకి ట్రాఫిక్ స‌మ‌స్య పెరిగిపోతుంది. దీంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. ట్రాఫిక్ సమస్యకు చెక్‌ పెట్టేందుకు పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సిటీలో సరి-బేసి విధానం అమలు చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ, ముంబై నగరాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. కార్‌ పూలింగ్‌ విధానంపైనా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని అనేక మెట్రో నగరాల్లో ఈ విధానం అమల్లో ఉంది.

ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నామని స్పష్టం చేశారు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. అయితే వివిధ పద్ధతులపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలో కారు పూలింగ్ విధానం అమల్లో ఉందని.. ఇక్కడ కూడా సరి - బేసి విధానం అమలు చేసే అంశంపైనా ఆలోచిస్తున్నామని చెప్పారు. కార్ పూలింగ్‌ ముంబై, ఢిల్లీలో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోందని చెప్పారు. బెంగళూరులోని కార్‌ పూలింగ్ అమల్లోకి తెచ్చినప్పటికీ సక్సెస్ కాలేదన్నారు. కార్‌పూలింగ్ సక్సెస్ అయితే చాలా వనరులని సేవ్ చేసినవాళ్లమవుతామన్నారు. ఈ విధానాన్ని అమలు చేసే ముందు అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. సిటీలో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించే విషయమై అధ్యయనం చేస్తున్నామన్నారు సీపీ. ఏదైనా కొత్త విధానం అమలు చేసినప్పుడు మొదట్లో కొన్ని సమస్యలు వస్తాయన్నారు. తర్వాత దాని మేలు అందరికీ అర్థం అవుతుందన్నారు.

2023లో సిటీలో కొత్తగా 16 వేల 150 వెహికిల్స్ యాడ్‌ అయ్యాయి. అక్టోబర్ 31 నాటికి సిటీలో రిజిస్టర్ అయిన వెహికిల్స్ సంఖ్య 85 లక్షలుగా ఉంది. 2014లో ఈ సంఖ్య 42 లక్షలుగా మాత్రమే ఉంది. దాదాపు పదేళ్ల కాలంలో సిటీలో వెహికిల్స్ సంఖ్య రెట్టింపయింది. సిటీలో దాదాపు 290 కిలోమీటర్ల రోడ్‌ నెట్‌వర్క్ ఉంది.

First Published:  23 Dec 2023 9:40 AM GMT
Next Story