Telugu Global
Telangana

'తెలంగాణ శ్వాసగా..మీరు నడిపిన పోరాటం స్ఫూర్తిదాయకం'

తెలంగాణ సిద్దాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఇవ్వాళ్ళ కేటీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. జయశంకర్ తో తాను దిగిన ఫోటో ట్విట్టర్ లో పంచుకున్నారు.

తెలంగాణ శ్వాసగా..మీరు నడిపిన పోరాటం స్ఫూర్తిదాయకం
X

తన జీవితాన్నే తెలంగాణకు అంకితం చేసిన తెలంగాణ సిద్ధాంత‌క‌ర్త ప్రొఫెసర్ జయశంకర్ జ‌యంతి సంద‌ర్భంగా ఇవ్వాళ్ళ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, టీఆరెస్ కార్యకర్తలు ఆయనకు నివాళులు అర్పించారు.

తెల‍ంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ హ్యాండిల్ లో ''తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు!'' అని ట్వీట్ పోస్ట్ చేశారు.

''తెలంగాణ శ్వాసగా.. తెలంగాణే ధ్యాసగా

మీరు నడిపిన పోరాటం స్ఫూర్తిదాయకం..

మీరు గడిపిన జీవితం మహోన్నతం..

స్వరాష్ట్రంలో తెలంగాణ సాగిస్తున్న

ప్రగతి ప్రస్థానం సాక్షిగా.. మీకివే మా నివాళులు

జోహార్ Prof. జయశంకర్ సార్ '' అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

అంతే కాక జయశంకర్ తో తాను కలిసి ఉన్న ఫోటోను మరో ట్వీట్ లో షేర్ చేశారు కేటీఆర్. ''జ‌య‌శంక‌ర్ సార్‌తో దిగిన కొన్ని ఫోటోల్లో ఇది నా ఫేవ‌రెట్ పిక్. 2009, న‌వంబ‌ర్ 29న అలుగ‌నూరు వ‌ద్ద కేసీఆర్‌ను అరెస్టు చేసిన తర్వాత‌ జ‌య‌శంక‌ర్ సార్, నేను హ‌నుమ‌కొండ‌లోని ఆయ‌న ఇంటికి వెళ్ళాం. ఆ త‌ర్వాత రోజు ప్రొఫెస‌ర్ జయశంకర్ సార్ ను అరెస్టు చేసి ఖ‌మ్మం జైలుకు, న‌న్ను వ‌రంగ‌ల్ జైలుకు త‌ర‌లించారు అని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

First Published:  6 Aug 2022 7:21 AM GMT
Next Story