Telugu Global
Telangana

కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించగానే, ట్విట్టర్లో ట్రెండింగ్ అయిన‌ 'తెలంగాణ'

తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రోజు భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో తెలంగాణ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. తెలంగాణతో పాటు BRS, TRS, కేసీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ లు కూడా ట్రెండ్ అయ్యాయి.

కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించగానే, ట్విట్టర్లో ట్రెండింగ్ అయిన‌ తెలంగాణ
X

ఈ రోజు భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్

జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా సోషల్ మీడియాలో తెలంగాణ, BRS, TRS, కేసీఆర్ అనే హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అయ్యాయి. నెటిజనులు కేసీఆర్ కువిషెస్ చెప్తూ బీఆరెస్ విజయవంతం కావాలని ఆశించారు.

''TRS తెలంగాణను అభివృద్ది చేసిన విధంగా BRS దేశాన్ని అభివృద్ధి చేస్తుంద‌ని ఆశిస్తున్నాను.'' అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా "భారతదేశాన్ని మార్చడానికి, అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడానికి నడుం భిగించిన KCR కు స్వాగతం" అని మరొకరు రాశారు.

Advertisement

ఒక్క తెలుగు వాళ్ళ నుంచే కాకుండా కేసీఆర్ బీఆరెస్ కు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. అనేక ప్రాంతాల నుంచి సోషల్ మీడియాలో బీఆరెస్ కు స్వాగతం పలుకుతూ కామెంట్లు చేశారు నెటిజనులు.


Advertisement
Next Story