Telugu Global
Telangana

కొండా వర్సెస్‌ రేవూరి.. వరంగల్‌ కాంగ్రెస్‌లో వర్గపోరు (ఆడియో లీక్)

రేవూరిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. 10 రోజుల ముందు పార్టీలో చేరారంటూ రేవూరిని విమర్శించారు. గెలిచే సత్తా లేని నిన్ను పరకాలలో గెలిపించింది తామేనన్నారు కొండా.

కొండా వర్సెస్‌ రేవూరి.. వరంగల్‌ కాంగ్రెస్‌లో వర్గపోరు (ఆడియో లీక్)
X

కాంగ్రెస్‌ అంటేనే గ్రూప్‌ పాలిటిక్స్‌, వర్గ పోరు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాకముందే నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ఫోన్‌ కాల్స్‌ లీకవుతున్నాయి. తాజాగా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌ రెడ్డిల మధ్య చేరికల విషయంలో వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన ఆడియో కాల్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 10 నిమిషాల పాటు ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం జరిగింది.


ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి విజయం సాధించారు రేవూరి ప్రకాష్ రెడ్డి. పరకాల నియోజకవర్గం గీసుకొండ మండలానికి చెందిన రడం భరత్‌ అనే కాంగ్రెస్ నేత విషయంలో రేవూరి, కొండా సురేఖల మధ్య మాటల యుద్ధం జరిగింది. రేవూరికి ఫోన్ చేసిన కొండా సురేఖ.. రడం భరత్‌తో ఇబ్బందేంటని ఆయనను ప్రశ్నించారు. భరత్‌తో తనకు ఇబ్బందేనని రేవూరి సమాధానం ఇచ్చారు. అనంతరం ఇద్దరి మధ్య చేరికల విషయంలో మాటమాట పెరిగింది.

ఈ నేపథ్యంలోనే రేవూరిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. 10 రోజుల ముందు పార్టీలో చేరారంటూ రేవూరిని విమర్శించారు. గెలిచే సత్తా లేని నిన్ను పరకాలలో గెలిపించింది తామేనన్నారు కొండా. గీసుకొండ తమ సొంత మండలమని.. అక్కడ తాము చెప్పినట్లే నడవాలన్నారు సురేఖ. కాదని వ్యతిరేకిస్తే వర్గ పోరు ఉంటుందని వార్నింగ్ కూడా ఇచ్చారు. భరత్‌ వ్యవహారం తనకు నచ్చలేదని.. అందుకే వ్యతిరేకించానన్నారు రేవూరి. నాకు ధమ్కీ ఇస్తున్నావా అంటూ కొండా సురేఖకు కౌంటర్ ఇచ్చారు.

First Published:  8 May 2024 5:02 AM GMT
Next Story