Telugu Global
Telangana

కుల వృత్తులకు ఇచ్చే రూ.1 లక్ష సాయం కోసం ఇలా దరఖాస్తు చేయండి

కుల వృత్తులు, చేతి వృత్తుల వారిరూ.1 లక్ష సాయం అందించే కార్యక్రమాన్ని ఈ నెల 9న సీఎం కేసీఆర్ మంచిర్యాలలో లాంఛనంగా ప్రారంభించనున్నారు.

కుల వృత్తులకు ఇచ్చే రూ.1 లక్ష సాయం కోసం ఇలా దరఖాస్తు చేయండి
X

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కుల వృత్తులు, చేతి వృత్తులు చేసుకునే వారికి రూ.1 లక్ష సాయం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విశ్వ బ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కుల వృత్తులతో పాటు చేతి వృత్తులను నమ్ముకొని జీవిస్తున్న వారికి ఆర్థిక సాయం అందించాలని కేబినెట్ ఆమోదించింది. కాగా, దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో ఒక కేబినెట్ సబ్ - కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

కుల వృత్తులు, చేతి వృత్తుల వారిరూ.1 లక్ష సాయం అందించే కార్యక్రమాన్ని ఈ నెల 9న సీఎం కేసీఆర్ మంచిర్యాలలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలచే ఎంపిక చేసిన లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. కాగా, ఇప్పటికే లబ్దిదారుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

రూ.1 లక్ష సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక వెబ్‌సైట్ రూపొందించింది. దీన్ని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. https://tsobmmsbc.cgg.gov.in అనే వెబ్‌సైట్‌లో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఫొటో, ఆధార్, కుల దృవీకరణ పత్రంతో పాటు 38 కాలమ్స్‌లో ఉన్న అప్లికేషన్‌ను పూర్తిగా నించాల్సి ఉంటుంది. ఇప్పటికే వెబ్‌సైట్‌లో దరఖాస్తు అందుబాటులోకి వచ్చింది. కుల వృత్తి, చేతి వృత్తులు చేసుకునే వారికి సంబంధిత పని ముట్లు, ముడి సరుకు కొనుగోలు చేయడానికి ఈ ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.

దరఖాస్తు చేయడానికి కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.

https://tsobmmsbc.cgg.gov.in/applicationFormforBC.action

First Published:  6 Jun 2023 10:21 AM GMT
Next Story