Telugu Global
Telangana

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్..

ఈ ఏడాది జులై నుంచి ఇవ్వాల్సి ఉన్న 4.8 శాతం డీఏను కూడా సిబ్బందికి మంజూరు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని వెల్లడించారు ఎండీ సజ్జనార్. అక్టోబర్ నెల వేతనంతో కలిపి ఈ డీఏను సిబ్బందికి చెల్లిస్తున్నట్లు ప్రకటించారు.

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్..
X

తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసి వారి చిరకాల వాంఛ నెరవేర్చిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు వారికి మరో గుడ్ న్యూస్ చెప్పారు. పెండింగ్ లో ఉన్న కరువు భత్యం(డీఏ)లను విడుదల చేసేలా ఆదేశాలిచ్చారు. అంతే కాదు కొత్తగా మరో డీఏ కూడా వారికి ప్రకటించారు. ఈమేరకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు.


ఇటీవల పీఆర్సీ ప్రకటనతో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. వారికి మధ్యంతర భృతి కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ప్రభుత్వంలో విలీనం అయిన ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త తెలిపింది యాజమాన్యం. పెండింగ్ లో ఉన్న కరువు భత్యాలన్నిటినీ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ ఏడాది జులై నుంచి ఇవ్వాల్సి ఉన్న 4.8 శాతం డీఏను కూడా సిబ్బందికి మంజూరు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని వెల్లడించారు ఎండీ సజ్జనార్. అక్టోబర్ నెల వేతనంతో కలిపి ఈ డీఏను సిబ్బందికి చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారని, ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ.. వారిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారని ఈ సందర్భంగా తన సందేశాన్ని విడుదల చేశారు సజ్జనార్. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం అని, ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ ప్రాధాన్యత ఇస్తుందని.. క్లిష్ట పరిస్థితుల్లోనూ 2019 నుంచి విడతల వారిగా ఇప్పటివరకు 9 డీఏలను మంజూరు చేశామని తెలిపారు. తాజా డీఏ మంజూరుతో అన్ని డీఏలను సంస్థ ఉద్యోగులకు చెల్లించినట్లయిందన్నారు.

First Published:  4 Oct 2023 12:12 PM GMT
Next Story