Telugu Global
Telangana

అనసూయపై తీవ్రమైన ట్రోలింగ్.. ఇంగ్లాండ్ క్రికెటర్‌ను కూడా లాగిన నెటిజన్లు

అనసూయ అలా ట్వీట్ చేయగానే ఇక ట్రోలర్లు మరింతగా రెచ్చిపోయారు. #Aunty అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండింగ్ చేయడం మొదలు పెట్టారు. ఆమెకు రీట్వీట్లు చేస్తూ ప్రతీ దానికి ఆంటీ ట్యాగ్‌ను వాడారు.

అనసూయపై తీవ్రమైన ట్రోలింగ్.. ఇంగ్లాండ్ క్రికెటర్‌ను కూడా లాగిన నెటిజన్లు
X

అనసవరంగా నోరు జారితే ఎన్ని అనర్థాలో పెద్దలు ఏనాడో చెప్పారు. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో.. ట్వీట్ జారినా అంతకంటే ఎక్కువ ప్రమాదం. సెలబ్రెటీలు ఎక్కడ దొరుకుతారా అని కాచుకొని కూర్చొని ఉండే నెటిజన్లకు తాజాగా యాంకర్, నటి అనసూయ దొరికిపోయారు. తనకు సంబంధం లేని విషయాలను ప్రస్తావించి తీవ్రమైన ట్రోలింగ్‌కు గురయ్యారు. ఎంతలా అంటే ప్రస్తుతం ట్విట్టర్ ట్రెండింగ్‌లో టాప్‌లో నిలిచేంతగా. ట్రెండింగ్‌లో నెంబర్ వన్‌గా ఉంటే సంతోషమే కదా అని డౌట్ రావొచ్చు.. అయితే అనసూయను 'ఆంటీ' అంటూ ట్రెండ్ చేస్తూ ట్రోలర్లు తమ కసిని తీర్చుకుంటున్నారు.

అసలు ఏం జరిగింది?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన 'లైగర్' సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా రిలీజ్‌కు ముందు విజయ్ దేవరకొండ ఎంతో యాటిట్యూడ్‌తో ప్రచారం చేశారు. విలేకరుల సమావేశంలో టేబుల్‌పై కాళ్లు పెట్టి మాట్లాడారని ఆయనపై ట్రోలింగ్ కూడా జరిగింది. భారీ అంచనాలతో విడుదలై చివరకు సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో యాంకర్ అనసూయ ఒక ట్వీట్ చేసింది. 'అమ్మను అన్న ఉసురు ఊరికే పోదు. కొన్ని సార్లు రావడం ఆలస్యమవొచ్చు. కానీ రావడం మాత్రం పక్కా' అంటూ ట్వీట్ చేసింది. ఐదేళ్ల క్రితం అర్జున్ రెడ్డి సినిమా విడుదలైనప్పుడు ఆ సినిమాలో అమ్మను బేస్ చేసుకొని ఒక తిట్టు ఉంటుంది. సినిమాలో మ్యూట్ చేసినా.. దాన్ని బయట విజయ్ దేవరకొండ పాపులర్ చేశాడు. తన సినిమా ప్రమోషన్ కోసం అలా చేసినట్లు తర్వాత ఒప్పుకున్నాడు.

అర్జున్ రెడ్డి సినిమా టైంలో జరిగిన రచ్చను బేస్ చేసుకొని.. లైగర్ ఫ్లాప్ సమయంలో అనసూయ ఇలా ట్వీట్ చేయడంతో విజయ్ దేవరకొండ అభిమానులు రెచ్చిపోయారు. అనసూయను టార్గెట్ చేస్తూ పలు ట్వీట్లు చేశారు. ఆమె టీవీ కార్యక్రమాల్లో చేసిన అసభ్య చేష్టలు, మాటలను ట్యాగ్ చేసి మరీ ట్రోల్ చేశారు. అయితే వీటిని అనసూయ పట్టించుకోకుండా వదిలేసి ఉంటే ట్విట్టర్ ట్రెండింగ్ అయ్యేది కాదు. కానీ విజయ్ అభిమానుల ట్రోలింగ్ తట్టుకోలేక మరో ట్వీట్ చేసింది. 'నా సోషల్ మీడియా అకౌంట్‌లో ఇంత చెత్త చేరుతుందని ఊహించలేదు. క్లీన్ చేయలేనంతగా పేరుకొని పోయింది. నేను పిరికిదాన్ని కాదు. అసలు ఏం జరిగిందో మీకు తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇకపై నన్ను, నా కుటుంబాన్ని కించ పరిచే ప్రతీ కామెంట్‌కు రిప్లై ఇస్తా. స్క్రీన్ షాట్ తీసి పోలీసులకు కంప్లైట్ చేస్తా' అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

అనసూయ అలా ట్వీట్ చేయగానే ఇక ట్రోలర్లు మరింతగా రెచ్చిపోయారు. #Aunty అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండింగ్ చేయడం మొదలు పెట్టారు. ఆమెకు రీట్వీట్లు చేస్తూ ప్రతీ దానికి ఆంటీ ట్యాగ్‌ను వాడారు. శుక్రవారం సాయంత్రం మొదలైని ఈ ట్వీట్ల వార్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. సినిమాల్లో ఆంటీ అంటూ సంబోధించిన దృశ్యాలు, జబర్దస్త్‌లొ అనసూయను ఆది ఆంటీ అని ప్రస్తావించిన క్లిప్స్‌ను జోడించి ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేశారు. రాత్రికి టాప్ ఫైవ్‌ ట్రెండింగ్స్‌లో ఉన్న ఆంటీ హ్యాష్ ట్యాగ్.. శనివారం ఉదయానికి టాప్ ప్లేస్‌కు చేరుకున్నది. ఆసియా కప్, గులాం నబీ ఆజాద్‌ల హ్యాష్ ట్యాగ్‌లను మించి ఆంటీ హ్యాష్ ట్యాగ్ టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది. ఆంటీ మమ్మల్ని పోలీసులకు చెప్పి అరెస్టు చేయించు.. అంటూ వెకిలిగా ట్వీట్లు చేస్తూ ట్రోలర్లు అనసూయను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు.

ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అప్పుడప్పుడు సింగిల్ లైనర్లు ట్వీట్ చేస్తుంటారు. ఇలా గత ఏడాది ఏదో విషయంలో 'ఐ యామ్ టెల్లింగ్ ఆంటీ' అంటూ ట్వీట్ పెట్టాడు. అతడి ట్వీట్‌ను కూడా ఇప్పుడు రీట్వీట్ చేస్తూ.. ఆర్చర్‌ను కూడా అరెస్ట్ చేయిస్తావా అని ట్రోలర్లు ప్రశ్నిస్తున్నారు. తాతను తాత, బామ్మను బామ్మ, ఆంటీని ఆంటీ అనకుండా ఏమనమంటావు అంటూ రెచ్చిపోయారు.

శ్రద్దా దాస్‌నూ వదల్లేదు..

అనసూయపై ఇంతలా ట్రోలింగ్ జరుగుతుంటే నటి శ్రద్దా దాస్ ఆమెకు సపోర్ట్‌గా ఓ ట్వీట్ చేశారు. నీ కంటే తక్కువ వయసు ఉన్న ఆడవాళ్లు చాలా ఏజ్డ్‌గా కనిపిస్తారు. కానీ నువ్వు చాలా అందంగా ఉంటావు. అస్సలు నీ వయసు కనపడదు అంటూ అనసూయ అందాన్ని వర్ణిస్తూ శ్రద్దా దాస్ ట్వీట్ చేశారు. దీంతో ఆమెను కూడా ట్రోలర్లు ఇష్టం వచ్చినట్లు ట్యాగ్ చేసి ఆడుకున్నారు. ఇప్పటికీ ఈ ఆంటీ హ్యాష్ ట్యాగ్ రచ్చ ఆగలేదు. ఎంతలా అంటే.. చివరకు ట్విట్టర్‌లో ఆంటీ అని సెర్చ్ చేస్తే అనసూయ భరద్వా.జ్ ఫస్ట్ ప్లేస్‌లో కనిపిస్తోంది. మొత్తానికి లైగర్ ఫ్లాప్ అయిన కసిని, కోపాన్ని ఇలా అనసూయ మీద తీర్చుకుంటున్నారు. పాపం అనసూయ.. పాత విషయాన్ని గుర్తు చేసి ఇలా అడ్డంగా బుక్ అయ్యిందని పలువురు సానుభూతి చూపిస్తున్నారు.

First Published:  27 Aug 2022 4:12 AM GMT
Next Story