Telugu Global
Telangana

750 కోట్ల రూపాయల పెట్టుబడితో తెలంగాణలో బ్యాటరీ తయారీ సంస్థ‌ - కేటీఆర్ సమక్షంలో ఒప్పందం

ముందుగా 210 కోట్ల రూపాయల పెట్టుబడితో 3 గిగావాట్ల సామర్ద్యంతో ఉత్పత్తి ప్రారంభిస్తామని, ఆ తర్వాత 2030 కల్లా 750 కోట్ల రూపాయల పెట్టుబడులతో 10 గిగా వాట్ల సామర్ద్యానికి విస్తరిస్తామని అలాక్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

750 కోట్ల రూపాయల పెట్టుబడితో తెలంగాణలో బ్యాటరీ తయారీ సంస్థ‌ - కేటీఆర్ సమక్షంలో ఒప్పందం
X

ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 750 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో మల్టీ గిగా వాట్ లిథియం కాథోడ్ మెటీరియల్ తయారీ యూనిట్ ను స్థాపించనుంది.

ఈ మేరకు ఆ సంస్థ, మంత్రి కేటీఆర్ సమక్షంలో దావోస్ లో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. లిథియం ఐరన్ ఫాస్ఫేట్ యాక్టివ్ బ్యాటరీలను ఈ కేంద్రంలో తయారు చేస్తారు.

ముందుగా 210 కోట్ల రూపాయల పెట్టుబడితో 3 గిగావాట్ల సామర్ద్యంతో ఉత్పత్తి ప్రారంభిస్తామని, ఆ తర్వాత 2030 కల్లా 750 కోట్ల రూపాయల పెట్టుబడులతో 10 గిగా వాట్ల సామర్ద్యానికి విస్తరిస్తామని అలాక్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు

ఈ ప్లాంట్ ద్వారా 600 మంది హై స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్‌కి ఉపాధి లభిస్తుంది. ఈ రోజు జరిగిన ఈ ఒప్పందం కార్యక్రమంలో అలాక్స్ సహ వ్యవస్థాపకుడు, MD మౌర్య సుంకవాల్,COO కిరీటి వర్మ , తెలంగాణ IT, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ,జయేష్_రంజన్, పెట్టుబడి ప్రమోషన్ & NRI వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి, E. విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దీనికి ముందు అలాక్స్ సహ వ్యవస్థాపకుడు, MD మౌర్య సుంకవాల్,COO కిరీటి వర్మలు మంత్రి కేటీఆర్ తో సమావేశమై చర్చలు జరిపారు. ఈ ఒప్పందాన్ని స్వాగతించిన కేటీఆర్ అధికారులను అభినందించారు

First Published:  17 Jan 2023 9:05 AM GMT
Next Story