Telugu Global
Telangana

కాంగ్రెస్‌లోకి అల్లు అర్జున్‌ మామ.. ఆ ఎంపీ సీటు హామీ..?

ఉమ్మడి నల్ల‌గొండ జిల్లాలోని పెద్దవూర మండలం చింతపల్లికి చెందిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్‌ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు.

కాంగ్రెస్‌లోకి అల్లు అర్జున్‌ మామ.. ఆ ఎంపీ సీటు హామీ..?
X

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారు. తొంద‌ర‌లోనే ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. నల్ల‌గొండ జిల్లాకు చెందిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో నాగార్జున సాగర్ టికెట్ ఆశించి భంగపడ్డారు.

అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి బీఆర్ఎస్‌ పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్న కంచర్ల ఎట్టకేలకు పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిని మల్కాజ్‌గిరి నుంచి ఎంపీ బరిలో ఉంచుతారని సమాచారం. ఈ హామీ మేరకే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు స‌మాచారం.

ఉమ్మడి నల్ల‌గొండ జిల్లాలోని పెద్దవూర మండలం చింతపల్లికి చెందిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్‌ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నాగార్జున సాగర్‌ నుంచి టికెట్ ఆశించినప్పటికీ.. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్‌కు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్‌.

First Published:  16 Feb 2024 8:40 AM GMT
Next Story