Telugu Global
Telangana

బ‌న్నీ మామ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి.. పెద్ద స్కెచ్చే వేశారుగా..!

కోట్ల రూపాయ‌ల ఆస్తులున్న చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డికి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ హోం మంత్రి జానారెడ్డితో ఎప్ప‌టి నుంచో స‌న్నిహిత సంబంధాలున్నాయి.

బ‌న్నీ మామ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి.. పెద్ద స్కెచ్చే వేశారుగా..!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు పిల్ల‌నిచ్చిన మామ‌గారు.. అదేనండీ స్నేహారెడ్డి తండ్రి కంచ‌ర్ల చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి.. అల్లుడి క్రేజ్‌ను పూర్తిగా వాడేసుకుంటున్నారు. ఎలాగైనా ఈసారి నాగార్జునసాగ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేయాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్న చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి అందుకోసం బ‌న్నీ సినీ గ్లామ‌ర్‌నూ ప్ర‌యోగిస్తున్నారు.

కాంగ్రెస్‌లో టికెటివ్వ‌క బీఆర్ఎస్‌లోకి వ‌చ్చారు

కోట్ల రూపాయ‌ల ఆస్తులున్న చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డికి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ హోం మంత్రి జానారెడ్డితో ఎప్ప‌టి నుంచో స‌న్నిహిత సంబంధాలున్నాయి. ఆ రిలేష‌న్స్‌తోనే గ‌తంలో మిర్యాల‌గూడ అసెంబ్లీ, న‌ల్గొండ ఎంపీ టికెట్ల కోసం ప్ర‌య‌త్నించారు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. ఈ ప‌రిస్థితుల్లో కేసీఆర్ పిలుపుతో 2014 ఎన్నిక‌ల‌కు ముందు బీఆర్ఎస్‌లో చేరారు. రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2018లో టికెట్ ద‌క్క‌లేదు. అందుకే ఈసారి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం నాగార్జున‌సాగ‌ర్ నుంచి పోటీ చేయాల‌ని గట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

నోముల భ‌గ‌త్‌తో పోటీ

నాగార్జున‌సాగర్‌లో దివంగ‌త క‌మ్య‌నిస్టు నేత, చివ‌రిలో బీఆర్ఎస్‌లో చేరిన నోముల నర్సింహ‌య్య కుమారుడు భ‌గ‌త్ ఎమ్మెల్యే. వారి సామాజిక‌వ‌ర్గం ఓట్లు గ‌ణ‌నీయ‌మైన సంఖ్య‌లో ఉన్నాయి. అలాంటి ప‌రిస్థితుల్లో యువ‌కుడైన భ‌గ‌త్‌ను కాద‌ని సీటు తెచ్చుకోవాలంటే ఇంకా ఏదో కావాల‌ని ఆలోచించిన చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి త‌న అల్లుడు అల్లు అర్జున్‌ను ఇన్వాల్వ్ చేస్తున్నారు. శ‌నివారం నాగార్జున‌సాగ‌ర్‌లో నిర్మించిన‌ కంచ‌ర్ల ఫంక్ష‌న్ ప్యాలెస్ ప్రారంభోత్స‌వానికి బ‌న్నీని పిలిపించారు. యువ‌త ఆయ‌న్ను చూడ‌డానికి భారీగా వ‌చ్చారు. అవ‌స‌ర‌మైతే అల్లుడ్ని ప్ర‌చారానికి కూడా తీసుకొస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్న చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డికి బీఆర్ఎస్‌ టికెట్ ద‌క్కుతుందో లేదో చూడాలి మ‌రి!

First Published:  20 Aug 2023 8:10 AM GMT
Next Story