Telugu Global
Telangana

అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆర్మీ లాండ్ ను కేటాయించండి... కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి

కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి ఏ గిరిధర్‌ను గురువారం ఢిల్లీలో కలిసిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ రక్షణ భూముల కేటాయింపులకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించారు.

అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆర్మీ లాండ్ ను కేటాయించండి... కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి
X

వివిధ మౌలిక సదుపాయాలాను అభివృద్ది చేయడానికి రక్షణ భూములను కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది, ముఖ్యంగా ప్రజల రాకపోకల కోసం వినియోగించే రోడ్లను మూసి వేశారని, AOC సెంటర్‌లో ప్రత్యామ్నాయ రహదారులను అభివృద్ధి చేయడం కోసం భూమి ఇవ్వాల్సిందిగా కోరింది రాష్ట్ర‍ం.

కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి ఏ గిరిధర్‌ను గురువారం ఢిల్లీలో కలిసిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రక్షణ భూముల కేటాయింపులకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించారు.

AOC రోడ్ల మూసివేతకు బదులుగా AOC సెంటర్‌లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి రక్షణ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని ప్రధాన కార్యదర్శి అభ్యర్థించారు. మెహిదీపట్నంలో స్కై వాక్ నిర్మాణానికి కూడా అనుమతి ఇవ్వాలని కోరారు.

అంతేకాకుండా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, లింక్ రోడ్ల ఏర్పాటు, రోడ్ల విస్తరణ కోసం రక్షణ భూముల ఆవశ్యకత గురించి ప్రధాన కార్యదర్శి, కేంద్ర‌ రక్షణ కార్యదర్శికి వివరించారు.

ఆ తర్వాత ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శైలేష్‌ కే సింగ్‌తో సమావేశమై ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ చెల్లింపు సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తెలంగాణలో వరి అత్యంత ముఖ్యమైన పంట అని, కోత అనంతర నిర్వహణను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయనకు వివరించారు. చిన్న, సన్నకారు రైతుల కోసం నూర్పిడి ప్లాట్‌ఫారమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

First Published:  30 Dec 2022 2:54 AM GMT
Next Story