Telugu Global
Telangana

తెలంగాణలో 2000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ఎయిర్ టెల్

భారతి ఎయిర్‌టెల్ గ్రూప్, దాని డేటా సెంటర్ విభాగం, Nxtra డేటా సెంటర్స్ ద్వారా, మౌలిక సదుపాయాల కోసం రూ.2,000 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. మొదటి దశ 60 మెగావాట్ల (MW) IT లోడ్ సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది.

తెలంగాణలో 2000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ఎయిర్ టెల్
X

భారతీ ఎయిర్‌టెల్ గ్రూప్‌ హైదరాబాద్‌లో భారీ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. దీని కోసం 2వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఆ సంస్థ ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రకటించారు.

భారతి ఎయిర్‌టెల్ గ్రూప్, దాని డేటా సెంటర్ విభాగం, Nxtra డేటా సెంటర్స్ ద్వారా, మౌలిక సదుపాయాల కోసం రూ.2,000 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. మొదటి దశ 60 మెగావాట్ల (MW) IT లోడ్ సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది. ఇది అత్యాధునిక సాంకేతికతలతో రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో అమలులోకి వస్తుందని అంచనా.

తెలంగాణలో ఎయిర్‌టెల్-ఎన్ ఎక్స్‌ట్రా డేటా సెంటర్ కోసం పెట్టుబడులు పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ ఇప్పుడు భారతదేశంలోని హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌లకు కేంద్రంగా ఉంది. ఎయిర్ టెల్ మాతో ఈ అనుబంధాన్ని కొనసాగించాలని నేను ఆశిస్తున్నాను. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమకు అనుగుణంగా డిజిటల్ మౌలిక సదుపాయాలను రూపొందించడానికి రాష్ట్రం ఎయిర్‌టెల్-ఎన్‌ఎక్స్‌ట్రాతో కలిసి పని చేస్తుంది.”అని కేటీఆర్ అన్నారు.

“ఇది భారతదేశంలోని మా అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌లలో ఒకటి. తెలంగాణతో కలిసి పనిచేయడం మాకు సంతోషంగా ఉంది. మే 2022 WEF వార్షిక సమావేశం లో డేటా సెంటర్ ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వంతో మా చర్చలు ప్రారంభించినప్పటి నుండి,అతి తక్కువ‌ వ్యవధిలో ప్రాజెక్ట్ నిర్మాణంలోకి వచ్చేలా చేయడానికి ప్రభుత్వం చాలా వేగంగా పనిచేసింది. మా వ్యాపారాలకు సంబంధించి ఇతర పోర్ట్‌ఫోలియోలను కూడా రాష్ట్రంలో పెంచడానికి మేము తెలంగాణతో కలిసి పని చేస్తాము, ”అని భారతీ ఎయిర్‌టెల్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ చెప్పారు.

First Published:  19 Jan 2023 2:49 AM GMT
Next Story