Telugu Global
Telangana

తెలంగాణలో 15 అసెంబ్లీ సీట్లను టార్గెట్ చేసిన ఎంఐఎం పార్టీ.. ఆ నియోజకవర్గాలు ఏంటో తెలుసా?

హైదరాబాద్ పాత నగరంలోని నియోజకవర్గాలకే పరిమితం అయిన ఎంఐఎం పార్టీ.. ఇకపై తెలంగాణలోని ఇతర జిల్లాలకు కూడా విస్తరించాలనే నిర్ణయం తీసున్నట్లు దారస్సలాం వర్గాలు తెలియజేస్తున్నాయి.

తెలంగాణలో 15 అసెంబ్లీ సీట్లను టార్గెట్ చేసిన ఎంఐఎం పార్టీ.. ఆ నియోజకవర్గాలు ఏంటో తెలుసా?
X

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగే లేదనే విషయం ఎవరిని అడిగినా చెప్తారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్‌కు కొత్త ప్రతిపక్ష పార్టీ తయారయ్యింది. తెలంగాణతో సహా గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీని చాలా మంది ఆదరించారు. అయితే హైదరాబాద్ నగరంలో మాత్రం కొన్నేడ్లుగా ఎంఐఎం పాతుకొని పోవడంతో పాటు, అది మతతత్వ పార్టీ కావడంతో పాత నగరంలోని 7సీట్లు వాళ్లే గెలుచుకున్నారు. జాతీయ ప్రయోజనాలు ఆలోచించిన బీఆర్ఎస్ కూడా ఏనాడూ ఏఐఎంఐఎంను దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా లేదు.

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అధికార నివాసం అయిన ప్రగతి భవన్ లోపలి కూడా కొన్ని పర్మిషన్స్ తీసుకొని వెళ్లే అవకాశం ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీకి మాత్రమే ఉండేది. ఆ మధ్య ఓవైసీ ఏకంగా టూ వీలర్ వేసుకొని నేరుగా సీఎం కేసీఆర్ అధికార నివాసానికి వెళ్లారు. దీంతో అందరూ బీఆర్ఎస్, ఎంఐఎంకి మధ్య మిత్ర బంధ ఉందని భావించారు. కానీ ఈ రెండ పార్టీల మధ్య అనుకున్నంత బంధమేమీ లేదని స్పష్టం అవుతోంది.

బీఆర్ఎస్ పార్టీ తమ సొంత అజెండాతోనే ముందుకు వెళ్తోంది. అధినేత కేసీఆర్ జాతీయ ప్రయోజనాల కోసమే పార్టీని ముందుకు తీసుకొని వెళ్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో ఇన్నాళ్లూ బీఆర్ఎస్‌కు మిత్ర పక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీ సరికొత్త స్ట్రాటజీని తీసుకొచ్చింది. బీఆర్ఎస్ పార్టీ బలంగా ఎదుగుతుండటంతో తాము కూడా సొంత బలాన్ని నిరూపించుకోవాలనే వ్యూహాన్ని అమలు చేస్తోంది.

ఇన్నాళ్లు హైదరాబాద్ పాత నగరంలోని నియోజకవర్గాలకే పరిమితం అయిన ఎంఐఎం పార్టీ.. ఇకపై తెలంగాణలోని ఇతర జిల్లాలకు కూడా విస్తరించాలనే నిర్ణయం తీసున్నట్లు దారస్సలాం వర్గాలు తెలియజేస్తున్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో చెప్పుకోదగిన పేరు ఉన్నది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు ఎంపీ సీటు కూడా ఎంఐఎం గెలుచుకున్నది. అయినా సరే ఏనాడూ సొంత రాష్ట్రమైన తెలంగాణలో హైదరాబాద్ దాటి బయటకు వెళ్లలేదు.

తాజాగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ విషయంలో అసెంబ్లీలో జరిగిన చర్చలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్, బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ఇన్నాళ్లూ మిత్ర పక్షంగా ఉన్న రెండు పార్టీలు ఇప్పుడే ఏకంగా అసెంబ్లీ వేదికగానే వాదులాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇకపై రెండు పార్టీలు కలిసి ఉండవని రాజకీయ విశ్లేషకులు కూడా చర్చించుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే...

ఎంఐఎం పార్టీని తెలంగాణలోనే కాకుండా దేశంలోని ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో విస్తరించాలని రెండు నెలల క్రితమే పార్టీ నిర్ణయించింది. ముఖ్యంగా ఎంఐఎం రెగ్యులర్‌గా గెలుస్తున్న పాత నగరంలోని నియోజకవర్గాలతో పాటు నిజామాబాద్ అర్బన్, సంగారెడ్డి, కరీంనగర, బోధన్, కామారెడ్డి, నిర్మల్, ముధోల్, ఆదిలాబాద్, కాగజ్‌నగర్, కోరుట్ల, ఖమ్మం, వరంగల్ ఈస్ట్,జహీరాబాద్, వికారాబాద్, షాద్నగర్ నియోజకవర్గాలను ఎంఐఎం ఫోకస్ చేసినట్లు దారుస్సలాం వర్గాలు చెబుతున్నాయి.

ఆయా నియోజకవర్గాల్లో ముస్లిం అభ్యర్థుల కంటే బలమైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను బరిలోకి దింపాలని ఓవైసీ కుటుంబం ఆలోచిస్తోంది. మరోవైపు సీఎం కేసీఆర్‌తో బలమైన స్నేహ బంధం కొనసాగిస్తున్న ఓవైసీ కుటుంబం తమంతట తాముగా అభ్యర్థులను నిలబెడుతుందా అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి.

First Published:  8 Feb 2023 11:52 AM GMT
Next Story