Telugu Global
Telangana

తెలంగాణకు రూ.16,650 కోట్ల భారీ పెట్టుబడి.. మంత్రి కేటీఆర్ ట్వీట్

సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ పంకజ్‌ పట్వారీ, ఇతర ప్రతినిధులను కలిసే అవకాశం తనకు లభించిందని, భవిష్యత్‌ ప్రణాళికలపై చర్చించామని మంత్రి కేటీఆర్‌ చెప్పుకొచ్చారు.

తెలంగాణకు రూ.16,650 కోట్ల భారీ పెట్టుబడి.. మంత్రి కేటీఆర్ ట్వీట్
X

తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. తాజాగా ప్రపంచంలోని ప్రముఖ ఈక్విటీ సంస్థల్లో ఒకటైన అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ.. హైదరాబాద్‌లో 2 బిలియన్‌ డాలర్లు (ఇండియన్‌ కరెన్సీలో దాదాపు రూ.16,650 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. కోహన్స్‌ లైఫ్‌సైన్సెస్‌కు సంబంధించిన హెడ్‌క్వార్టర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌.

అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ పంకజ్‌ పట్వారీ, ఇతర ప్రతినిధులను కలిసే అవకాశం తనకు లభించిందని, భవిష్యత్‌ ప్రణాళికలపై చర్చించామని మంత్రి కేటీఆర్‌ చెప్పుకొచ్చారు. ఈ పెట్టుబడి ఫార్మాస్యూటికల్‌ అండ్ లైఫ్‌ సైన్సెస్‌ సెక్టార్‌లో హైదరాబాద్‌ ప్రాముఖ్యతను తెలియజేస్తుందంటూ ట్వీట్ చేశారు.


లైఫ్‌ సైన్సెస్‌ సెక్టార్‌ను ప్రస్తుతం 80 బిలియన్‌ డాలర్ల నుంచి 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలో పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరపున అవసరమైన మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్.

First Published:  29 Sep 2023 7:04 AM GMT
Next Story