Telugu Global
Telangana

గజ్వేలే కాదు.. అచ్చంపేటకు ఆ సెంటిమెంట్..!

1962 నుంచి మొత్తం 13 సార్లు అచ్చంపేట నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే దాదాపు 12 సార్లు ఇదే విషయం రుజువైంది. అచ్చంపేటలో గెలిచిన అభ్యర్థికి సంబంధించిన పార్టీనే రాష్ట్రంలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

గజ్వేలే కాదు.. అచ్చంపేటకు ఆ సెంటిమెంట్..!
X

రాజకీయాల్లో సెంటిమెంట్‌ కామన్‌. గజ్వేల్‌లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న ప్రచారం బలంగా ఉంది. అయితే ఈ సెంటిమెంట్‌ కేవలం గజ్వేల్‌కే పరిమితం కాలేదు.. శనివారం అర్ధరాత్రి బీఆర్ఎస్‌, కాంగ్రెస్ మధ్య ఘర్షణతో వార్తల్లో నిలిచిన అచ్చంపేట నియోజకవర్గానికి కూడా ఉంది. ప్రస్తుతం SC రిజర్వ్‌డ్‌గా ఉన్న ఈ స్థానంలో ఎవరు గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఉంది.

1962 నుంచి మొత్తం 13 సార్లు అచ్చంపేట నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే దాదాపు 12 సార్లు ఇదే విషయం రుజువైంది. అచ్చంపేటలో గెలిచిన అభ్యర్థికి సంబంధించిన పార్టీనే రాష్ట్రంలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2009లో ఒక్కసారి మాత్రమే ఈ సెంటిమెంట్‌కు బ్రేక్ పడింది. ఆ ఎన్నికల్లో అచ్చంపేటలో తెలుగుదేశం అభ్యర్థి గెలవగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక ప్ర‌త్య‌ర్థి పార్టీ దాడిలో గాయపడిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హ్యాట్రిక్‌పై కన్నేశారు.

అచ్చంపేట రికార్డు ఇది-

1962- కాంగ్రెస్‌ అభ్యర్థి నాగన్న గెలుపు, అధికారంలోకి కాంగ్రెస్‌.

1967,72,78- కొనసాగిన ట్రెండ్‌, అధికారంలోకి కాంగ్రెస్‌

1982- తెలుగుదేశం అభ్యర్థి పి.మహేంద్రనాథ్‌ గెలుపు, అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌

1985- తెలుగుదేశం అభ్యర్థి పి.మహేంద్రనాథ్‌ బైపోల్‌లో గెలుపు, అధికారం నిలుపుకున్న టీడీపీ

1989- కాంగ్రెస్ అభ్యర్థి డి.కిరణ్‌ కుమార్‌ గెలుపు. అధికారంలోకి కాంగ్రెస్‌

1994,99-టీడీపీ అభ్యర్థి పి.రాములు గెలుపు, తిరిగి అధికారంలోకి తెలుగుదేశం

2004- కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణ గెలుపు..అధికారంలోకి హస్తం పార్టీ

2009- తెలుగుదేశం అభ్యర్థి గెలుపు..అధికారం నిలుపుకున్న కాంగ్రెస్

2014,18- బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు గెలుపు, అధికారంలోకి బీఆర్ఎస్‌

First Published:  14 Nov 2023 3:09 AM GMT
Next Story